సబ్ ఫీచర్

సమస్యకు స్వాగతం !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మధించకపోతే లక్ష్మిని పొందలేక
పోయేవాడివి కదా! దేహి అని బలిని అర్థించకపోతే భూమి, ఆకాశాన్ని ఆక్రమించే అవకాశం నీకు లేదు కదా! నీకు సత్యభామతోపాటు
శమంతక మణిని సత్రాజిత్తు ఇవ్వకున్నా నీకు అది దొరికేదా!
ఇంద్రుడు అంగీకరించకపోతే నందన వనంలో పెరిగిన పారిజాత వృక్షాన్ని పెళ్లగించి నాటించలేకపోయేవాడివి కదా!’

కాసుల పురుషోత్తమ కవి ‘ఆంధ్రనాయక శతకం’లో శ్రీ మహావిష్ణువు గురించి రాసిన పద్యం భావం ఇది. పాల సముద్రాన్ని మధించడం, బలిని అర్ధించాల్సిరావడం, సత్యభామని గెలవడం, పారిజాత వృక్షాన్ని భూమికి తీసుకురావడం...ఇవన్నీ శ్రీ మహా విష్ణువు వివిధ సమస్యలను సాధించినందుకు సాధించిన సంపదలు.
దేవతలకే తప్పలేదు సమస్యలు. కానీ ఆ సమస్యలే సంపదలకు మూలాలు అని సందేశం చెప్పడమే పురాణాల ఉద్దేశ్యం కావచ్చు.
జీవితంలో ఓ సమస్య రాగానే చాలామంది ఇప్పటినుండి ఇక కష్టాలు మొదలనుకుని కుదేలవుతారు. కానీ సమస్యను సాధిస్తే అమూల్యమైన సంపద సొంతమవుతుందని గ్రహించేవారు అతి కొద్దిమందే. ఆ కొద్దిమందే జీవితంలో విజేతలవుతారు. ఓ సమస్య జీవితంలోకి ప్రవేశించగానే మనలో తెలియకుండానే ఇంకో అంతర్గత సమస్య ఉత్పన్నమవుతుంది. అదే అపనమ్మకం. మనమీద మనకుండే అపనమ్మకం. ఆ భ్రమను నిజం చేయడానికి ఆ సమస్య శతవిధాలా ప్రయత్నిస్తునే ఉంటుంది. సమస్య మనతో ఉన్నప్పుడు సర్వకాల సర్వావస్థల యందు మనతో ఉండాల్సిన అస్త్రాలు రెండు. అవి ధైర్యం, నమ్మకం.
మొదట్లో ఘోర పరాజయంలా కనిపించే సమస్యే కాలక్రమాన గొప్ప విజయానికి బీజం అయ్యే అవకాశంలా తరచు కనిపిస్తుంది. దీనికి ఉదాహరణే మైకేల్ బ్లూమ్‌బర్గ్ వృత్తి జీవితం. ఆయన
బ్లూమ్‌బర్గ్ ఎల్‌పి కంపెనీకి వ్యవస్థాపకుడు. అదే పేరుతో ఒక స్మారక టెలివిజన్ స్టేషన్‌ను కూడా స్థాపించాడు.ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో బ్లూమ్‌బర్గ్ కూడా ఒకరు. 2001లో న్యూయార్కు నగరానికి మేయర్‌గా ఎన్నుకోబడ్డారాయన. మళ్లీ 2005లో .58 శాతం ఓట్లతో ఆయనే్న ఎన్నుకున్నారు జనం. మూడోసారి కూడా మేయర్ అయ్యాడాయన.
కానీ ఈ విజయపరంపర అంతా సమస్యతోనే ప్రారంభమైంది. ఆయన్ని పనిలోంచి తీసేసారు. 1981లో ఫిల్కో కార్పొరేషన్ అనే వర్తక సరుకులు అమ్మే వాణిజ్య సంస్థ వాల్‌స్ట్రీట్ పెట్టుబడి బ్యాంకు, సాలమన్ బ్రదర్స్‌ని తమతో కలుపుకున్నాక, ఇక ఆయన సేవలు తమకు అవసరం లేదని ఆ కంపెనీ ఆయనకి చెప్పింది. ఆయన ఈ సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ, ‘1981, ఆగస్టు 1వ తేదీన, ఆ శనివారం రోజు నేను చేసిన ఒకే ఒక పూర్తికాల పదవిని, నాకెంతో ప్రియమైన గొప్ప ఒత్తిడి గల జీవితాన్ని నేను వదులు కోవాల్సి వచ్చింది. అదే పదిహేనేళ్లపాటు రోజు పనె్నండు గంటల చొప్పున,వారానికి ఆరు రోజులు పనిచేసాక, నన్ను బైటికి గెంటేశారు! కానీ ఆ రోజు ఆ సమస్య రాకపోతే బ్లూమ్‌బర్గ్ తర్వాత అంత గొప్ప వ్యక్తి అవడానికి అవకాశం చిక్కేది కాదేమో!. ఒక్కోసారి ఇనుమడించిన ధైర్యం, అనుబంధాల్లో మెరుగు చూపడం, డబ్బు ఏదైనా కావచ్చు. ఇక ఆలస్యమెందుకు? సమస్యలకు ధైర్యంగా స్వాగతం చెప్పేద్దామా?

సమస్యతోనే సంపద సాధ్యం
‘1981, ఆగస్టు 1వ తేదీన, ఆ శనివారం రోజు నేను చేసిన ఒకే ఒక పూర్తికాల పదవిని, నాకెంతో ప్రియమైన గొప్ప ఒత్తిడి గల జీవితాన్ని నేను వదులు కోవాల్సి వచ్చింది. అదే పదిహేనేళ్లపాటు రోజు పనె్నండు గంటల చొప్పున,వారానికి ఆరు రోజులు పనిచేసాక, నన్ను బైటికి గెంటేశారు! కానీ ఆ రోజు ఆ సమస్య రాకపోతే బ్లూమ్‌బర్గ్ తర్వాత అంత గొప్ప వ్యక్తి అవడానికి అవకాశం చిక్కేది కాదేమో!
మైకేల్ బ్లూమ్‌బర్గ్
న్యూయార్క్ మాజీ మేయర్

సామర్ధ్యాన్ని అంచనావేసుకుంటే సరి!
జీవితంలో ప్రతిసారీ సంపద అనేది సమస్యతోనే సాధ్యం. సమస్య కన్నా మనల్ని ఎక్కువగా భయపెట్టేది మన చుట్టూ ఒక్కోసారి ఉండే నిరుత్సాహ వాతావరణం. ఆ వాతావరణమే క్రమేపీ నమ్మకం, ధైర్యాన్ని చంపేస్తూ ఉంటుంది. మన సామర్ధ్యాలు, నైపుణ్యాల గురించి మనకు తెలిసినంతగా ఎవరకు ఈ ప్రపంచంలో తెలియదు. గుడ్డితనంతో వారిచ్చే కొలామానలపై మనం కొనసాగినంతకాలం సమస్య ఎప్పుడూ అసాధ్యమైన అంశమే. ఒక్కసారి మనల్ని మనం ఎక్కువ అంచనా వేసుకోకుండా, మన సామర్ధ్యాన్ని సక్రమంగా గ్రహించి తదనుగుణంగా సమస్యను సాధిస్తే సంపద అనే విజయ బావుటా ఎప్పుడు మనకై స్వాగతం పలుకుతూఉంటుంది. ఆ సంపద అనేది ఈ రూపంలోనైనా ఉండొచ్చు.

- శృంగవరపు రచన