ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో పట్టుబడిన వారు పర్యాటకులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: నక్కపల్లి మండలం వేంపాడు టోల్‌గేటు వద్ద బుధవారం రాత్రి తాము అదుపులోకి తీసుకున్న ఐదుగురూ విదేశీ పర్యాటకులేనని, ఉగ్రవాద సంస్థలతో వారికి ఎలాంటి సంబంధాలు లేవని విశాఖ రూరల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ గురువారం తెలిపారు. కారులో దిల్లీనుంచి బయల్దేరిన వీరు ఒడిశా మీదుగా విశాఖ జిల్లాకు చేరుకున్నారని, వీరి వద్ద పాస్‌పోర్టులు, వీసాలు సరైనవే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌కి చెందిన ఈ అయిదుగురిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. విశాఖ సాగర తీరంలో అంతర్జాతీయ స్థాయిలో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అనుమానితులందరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.