తెలంగాణ

మహిళల రక్షణకు మరిన్ని సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం అనేక చర్యలు చేపట్టిందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. అంతేగాక, అత్యాచారం కేసుల్లో నిందితులకు సత్వరమే శిక్షపడేలా మరిన్ని సంస్కరణలు తీసుకురావల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళలు, చిన్నారుల భద్రతపై శుక్రవారం నగరంలోని హోటల్ ప్లాజాలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ మహిళలు, పిల్లల భద్రతను మరింత మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన వ్యూహాలను రూపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు, సంప్రదింపులు జరిగిన తర్వాత మహిళలు, పిల్లల భద్రత పై చేపట్టాల్సిన విధానంపై ముసాయిదా కార్యచరణను సిద్దం చేయనున్నట్లు తెలిపారు. మహిళల భద్రత కోసం 2014లో ఏర్పాటు చేసిన షీ టీమ్స్, మహిళలు, చిన్నారుల సహాయ కేంద్రాలతో చక్కటి ఫలితాలు వస్తున్నాయని, ఈ బృందాలు నేడు దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. మాడ్రన్ పోలింగ్, పోలీసుల విధి నిర్వాహణ పారదర్శకత వంటివి పెంపొందించేందుకు తాము ప్రవేశపెట్టిన ఎన్నో సంస్కరణలు చక్కటి ఫలితాలిస్తున్నాయని, ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసుల మన్ననలు పొందేలా మన పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని వివరిస్తూ, వారికి హోం మంత్రిగా తాను వ్యవహారిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నానని అన్నారు.
అంతేగాక, ఇటీవలే ఎలాంటి అఘాయిత్యం, అన్యాయం జరిగినా తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని మహిళల్లో పెంచేందుకు ఇటీవలే నగరంలో 2016లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఈ సమావేశంలో అనేక చర్చలు జరిగిన తర్వాత ‘గ్రూప్ యాక్షన్ ప్లాన్’ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.
కేవలం మూడేళ్ల వయస్సు కల్గిన తెలంగాణ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణపై ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. శాంతిభద్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు, ఇందుకు అవసరమైన స్థాయిలో ఇప్పటికే కానిస్టేబుల్స్, సబ్ ఇన్‌స్పెక్టర్ల నియామకాలను చేపట్టామని ఆయన వివరించారు. ఈ నియామకాల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

చిత్రం.. మహిళలు, చిన్నారుల భద్రతపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న
హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిజిపి అనురాగ్ శర్మ తదితరులు