సబ్ ఫీచర్

ముదిమి వయసు... పోషకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితాంతం ప్రతి వ్యక్తి తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. ముదిమి వయసులోనూ మరొకరితో పనిచేయించుకోకుండా చలాకీగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు. అందుకు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాలి. వయసు మీద పడుతున్న కొద్దీ అన్నిరకాల జబ్బులు ముంచుకొస్తాయి. ముఖ్యంగా గుండెజబ్బు, పక్షవాతం బారిన అధిక సంఖ్యలో వృద్ధ మహిళలు పడుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ వయసులో విటమిన్ డి ఎంతో అవసరం. ఎముకులు బలంగా ఉండటానికి తోడ్పడుతుంది. ముదిమి వయసులో విటమిన్ డి తగిన మోతాదులో తీసుకోకపోతే ఎముకలు గుల్లబారే ప్రమాదం ఉంది. విటమిన్ డి తీసుకునే వృద్ధ మహిళల్లో తుంటి ఎముకలు విరిగే ముప్పు 30శాతం తగ్గినట్లు ఓ అధ్యయనంలో సైతం వెల్లడైంది. ఇందుకోసం ముదిమి వయసులో సమతుల ఆహారం తీసుకుంటే ఎంతో మంచిది. విటమిన్లు అన్నీ అందేలా పండ్లు, మొలకెత్తిన విత్తనాలు, కాయగూరలు తదితర వాటిని తీసుకుంటే వ్యాధుల బారిన పడకుండా ఉండగలుగుతారు. విటమిన్ డిని సూర్యరశ్మి నుంచి తీసుకునే సామర్థ్యం వృద్ధుల చర్మంలో ఉండదు. వీరు ప్రతిరోజూ కొవ్వు తీసిన పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవటం మంచిది. అలాగే నెలసరి నిలిచిపోయిన వృద్ధ మహిళలు పాల పదార్థాలతోపాటు సోయా, తృణధాన్యాలు, గోబీపువ్వు, క్యాబేజీ, చేపలు ఎక్కువగా తీసుకుంటే మేలు. కొంతమంది నాలుగు బత్తాయి పళ్లు తీసుకుని మళ్లీ వారం రోజుల వరకు పండ్లు జోలికి వెళ్లారు. కాని సీజనల్‌గా, చౌకగా లభించే పళ్లను ప్రతిరోజూ తీసుకుంటే జబ్బులు మన దరిచేరవు.