తెలంగాణ

సమైక్య రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే బిసిలకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బిసిలకు, కుల వృత్తుల వారికి గుర్తింపు వస్తుందని వారంతా సామాజికంగా ఆర్ధికంగా రాజకీయంగా అభివృద్ధిలోకి వస్తారని భావించినా, సమైక్య రాష్ట్రంలో కంటే టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలోనే బిసిలకు తీరని అన్యాయం జరుగుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. హైదరాబాద్ త్యాగరాయగానసభలో జరిగిన బిజెపి బిసి మోర్చ గీతకార్మిక సదస్సులో ఆయన మాట్లాడారు. సదస్సుకు ఒబిసి మోర్చ అధ్యక్షుడు కాటం నర్సింహ యాదవ్ అధ్యక్షత వహించారు. బిసిల సంక్షేమాన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. బిసిలు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమ సమ్మెలో చురుకుగా పాల్గొన్నారని ఓటు బ్యాంకుగా వాడుకున్న తర్వాత బిసిలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. దాంతో బిసి వర్గాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని చెప్పారు. ఒక ప్రాంతం అంటూ లేకుండా బ్రతుకు దెరువుకోసం దేశమంతా తిరుగుతున్న సంచార జాతులను గుర్తించడం లేదని, ఎంబిసి జాబితా గురించి శాసనసభలో ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే జవాబు లేదని, 17 ఫెడరేషన్లు ఉంటే వాటిని 11 ఫెడరేషన్లుగా కుదించారని, కొంత మంది చైర్మన్లను నియమించినా, వారికి కుర్చీ కూడా లేదని, ఒక్క రూపాయి బడ్జెట్ లేదని అన్నారు. కల్తీ పేరుతో చీప్ లిక్కర్ లాబీకి తలొగ్గి గీత కార్మికులకు అన్యాయం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బంగారు తెలంగాణలో గీత కార్మికుల జీవితాలు బాగుపడతాయని అనుకున్నారని కాని వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. యువత ముందుకు వస్తే ఐదు కోట్ల నుండి 10 కోట్ల రూపాయిల వరకూ నీరా పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని, చెట్లెక్కే వారిని గుర్తించి, వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేసి గుర్తింపు కార్డులు ఇచ్చి, వారికి సామాజిక భద్రత, వృత్తి నైపుణ్యంలో మెలకువలు నేర్పించడం, ఐటిఐల్లో చేర్పించి సర్ట్ఫికేట్లు ఇవ్వడం జరుగుతోందని అన్నారు.