బిజినెస్

కీలక రంగాల్లో సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలేం, జూలై 5: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన నేపథ్యంలో బుధవారం ఇరు దేశాల మధ్య 7 కీలక ఒప్పందాలు జరిగాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెటన్యహుతో ప్రధాని మోదీ సుధీర్ఘ చర్చల అనంతరం అంతరిక్ష్యం, వ్యవసాయం, నీటి పారుదల తదితర ప్రధాన రంగాల్లో ఈ ఒప్పందాలు చోటుచేసుకున్నాయి.
ఇందులో 40 మిలియన్ డాలర్లతో భారత్-ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్‌అండ్‌డి) అండ్ టెక్నికల్ ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు కోసం జరిగిన ఒ అవగాహన ఒప్పందం (ఎమ్‌ఒయు) కూడా ఉంది. ‘ఈ రంగంలో పరస్పర లాభదాయక పరిష్కారాల అమలు, నిర్మాణం, అభివృద్ధి కోసం మా శాస్తజ్ఞ్రులు, పరిశోధకులు కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఒప్పందం చేసుకున్నాం.’ అని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్రమంలోనే 40 మిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేశామని తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల పెంపునకూ బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటున్నామన్నారు.
చిత్రం.. భారత్-ఇజ్రాయెల్ ప్రధానుల సమక్షంలో ఒప్పందాల దృశ్యం