తెలంగాణ

ఉద్యోగ సంఘాల నేతల బాహాబాహీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: సచివాలయంలో రెండు ఉద్యోగ సంఘాల మధ్య బుధవారం జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన సెక్షన్ ఆఫీసర్లతో సచివాలయ ఉద్యోగుల సంఘం నిర్వహించిన సమావేశాన్ని సచివాలయంలోని టిఎన్‌జివోల శాఖ నాయకులు అడ్డుకోవడంతో ఈ వివాదానికి కారణమైంది. సచివాలయంలో పని చేస్తున్న 24 మంది సెక్షన్ ఆఫీసర్లను ఆంధ్రప్రదేశ్ స్థానికత కారణంగా ఆరు నెలల కిందట ఆ రాష్ట్రానికి కేటాయించింది. అయితే వీరిని అక్కడ విధులలో చేర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో వారిని తిరిగి తెలంగాణ ప్రభుత్వంలోనే చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ సచివాలయంలోని డి బ్లాక్‌లో నరేందర్‌రావు నేతృత్వంలోని సచివాలయ ఉద్యోగుల సంఘం సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన సెక్షన్ ఆఫీసర్లను తిరిగి తెలంగాణ ప్రభుత్వంలో చేర్చుకోవద్దని సచివాలయ టిఎన్‌జివోల శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రకు కేటాయించిన సెక్షన్ ఆఫీసర్లతో సచివాలయ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలోకి టిఎన్‌జివో శాఖ నాయకులు దూసుకువచ్చి వాగ్వాదానికి దిగారు. దీంతో సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు సమావేశంలోకి ప్రవేశించిన టిఎన్‌జివోల నాయకులను బయటికి గెంటివేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు సంఘాలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సమావేశం జరుగుతున్న హాల్‌లోకి తోసుకురావడంతో పరస్పరం తోపులాట జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. సచివాలయ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వచ్చి ఇరు వర్గాలను పంపించి వేశారు. అనంతరం టిఎన్‌జివో రాష్ట్ర నాయకులు సచివాలయానికి వచ్చి తమ సంఘం నాయకులపై సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు దాడి చేసి కొట్టారని, జరిగిన సంఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకోవాలని టిఎన్‌జివో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్శదర్శి మామిళ్ల రాజేందర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేశారు.