తెలంగాణ

అద్దె గర్భంపై అధ్యయనానికి కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: సరోగసీ (అద్దె గర్భం)పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అద్దె గర్భం పేరిట అమాయక, పేద మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించేందుకు నడుం బిగించింది. ఈ సమస్యను శాశ్వతంగా నిరోధించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కమిటీని నియమిస్తూ జీవో (నెం.608) జారీ చేసింది. కమిటీ చైర్మన్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ రెడ్డిని, ఆరుగురు సభ్యులను, ఒక కన్వీనర్‌ను నియమించింది. ఈ కమిటీ ఈ అంశాన్ని అధ్యయనం చేసి 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. సభ్యులుగా వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, సిసిఎంబి మాజీ డైరెక్టర్ డాక్టర్ పుష్పా భార్గవ్, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఎథికల్ కమిటీ చైర్మన్ డాక్టర్ రామకృష్ణా రెడ్డి, రిటైర్డ్ గైనిక్-ఒబిజి డాక్టర్ బాలాంబ, ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ అనూరాధ, పేట్లబుర్జు ఒబిజి ప్రొఫెసర్ డాక్టర్ మాలతిని నియమించారు. కన్వీనర్‌గా ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను నియమించారు.
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ కమిటీ
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం నియమించింది. కన్వీనర్‌గా ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను, సభ్యులుగా వైద్య విద్య శాఖ డైరెక్టర్, నిమ్స్ డైరెక్టర్, వరంగల్ కాళోజీ నారాయణ రావు హెల్త్ సైనె్సస్ వర్సిటీ వైస్‌చాన్సలర్, ఎంప్లాయిస్ హెల్త్ స్కీం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నిమ్స్ ప్రొఫెసర్ అండ్ హెచ్‌ఒడి (ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్)లను నియమించారు.
క్లినికల్ ట్రయల్స్ కమిటీ
ఇలాఉండగా క్లినికల్ పరీక్షల (ట్రయల్స్) నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీని నియమిస్తూ జీవో (నెం.609) జారీ చేసింది. కమిటీ చైర్మన్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల్‌రెడ్డిని నియమించింది. కమిటీ సభ్యులుగా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఎథికల్ కమిటీ చైర్మన్ డాక్టర్ రామకృష్ణా రెడ్డి, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, నిమ్స్ రిటైర్డ్ డీన్ డాక్టర్ ఎంయుఆర్ నాయుడు, నిమ్స్-సిపిటి, ప్రొఫెసర్-హెచ్‌వోడి డాక్టర్ పి. ఉషారాణి, కన్వీనర్‌గా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అమృతరావును నియమించారు.