తెలంగాణ

ఈ-నామ్‌లో తెలంగాణ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: తెలంగాణలో మరో 16 మార్కెట్లలో ఈ-నామ్‌ను అమలు చేయాలని కేంద్రానికి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ కిందకు తీసుకొచ్చే ఉద్దేశంలో ఏర్పాటు చేసిన జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) అమలులో తెలంగాణ రాష్ట్రం ముందుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ అభినందించారు. ఈ-నామ్ అమలుచేస్తున్న తీరును అన్ని రాష్ట్రాలు తెలంగాణలో పర్యటించి పరిశీలించాలని సూచించారు. ఢిల్లీలో బుధవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల మార్కెటింగ్ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ-నామ్ మార్కెట్ల అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. అనంతరం హరీశ్‌రావు విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 180 వ్యవసాయ ఉత్పత్తుల కోనుగోలు మార్కెట్లున్నాయని, అందులో 44 మార్కెట్లలో కేంద్రం ఈ-నామ్ అమలు చేస్తున్నట్టు తెలిపారు.
అలాగే మరో 16 మార్కెట్లలో ఈ-నామ్ అమలుచేయాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ-నామ్ మార్కెట్ల అమలు తీరును కేంద్ర మంత్రి ప్రశంసించాని హరీశ్‌రావు తెలిపారు. దేశంలో మొదటిసారిగా ఈ-నామ్ ఇంటర్ మార్కెటింగ్ విధానాన్ని జడ్చర్ల-మహబూబ్‌నగర్, చొప్పదండి-కరీంనగర్ మధ్య అమలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే రైతులకు మార్కెటింగ్‌లో సింగిల్ లైసెన్సింగ్ విధానం అమలులోకి తీసుకొచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో లైసెన్సులుంటే దేశంలో ఎక్కడైన ట్రెడింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. గతంలో ఈ-నామ్ మార్కెట్ల వౌలిక సదుపాయలకోసం 35 లక్షలు కేంద్రం మంజూరు చేసేదని, ఇకనుంచి 75 లక్షలు కేంద్రం ఇవ్వనుందని ఆయన చెప్పారు. ఈ-నామ్ అమలులో కొన్ని సలహాలు, సూచనలు ఈ సమావేశంలో చేసినట్టు హరీశ్‌రావు వెల్లడించారు. తెలంగాణలో రూ.1024 కోట్లతో 17 లక్షల మెట్రిక్ టన్నులకు సరిపోయే విధంగా గిడ్డంగులు నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. గిడ్డంగుల నిర్మాణానికి సంబంధించి కేంద్రంనుంచి నిధుల రావాల్సి వుందని, వాటిని వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు చెప్పారు. అలాగే కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో సమావేశమై తెలంగాణలో పత్తి కొనుగోలు అంశంపై చర్చించినట్టు తెలిపారు. తెలంగాణలో పత్తిపంట దాదాపు 20 శాతం అధికంగా ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రికి వివరించినట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84 పత్తి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, సిసిఐద్వారా కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని కేంద్ర మంత్రిని కోరినట్టు తెలిపారు. అలాగే రంగుమారిన పత్తిని సైతం సిసిఐ మార్కెట్ల్‌ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.