తెలంగాణ

జిల్లాల్లో యుడిఏల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: రాష్ట్రంలో కొత్తగా మూడు నగరాభివృద్ధి సంస్థల(యుడిఏ)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థతో పాటు వరంగల్ నగరానికి కాకతీయ నగరాభివృద్ధి సంస్థ మాత్రమే ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలకు కూడా నగరాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు బుధవారం నిర్ణయించారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదించారు. నగరాభివృద్ధి సంస్థలను ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వీటికి పాలకవర్గాలను ప్రభుత్వం నియమించనుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా నగరాభివృద్ధి సంస్థల ఏర్పాటుపై అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత పాలక వర్గాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న నగరాభివృద్థి సంస్థలను తాత్కాలికంగా నగర పాలక సంస్థల కార్యాలయాలలో ఏర్పాటు చేయడానికి మున్సిపల్ పాలనా, పట్టణాభివృద్ధిశాఖ సన్నాహాలు చేస్తుంది.