సబ్ ఫీచర్

వ్యాపారం.. ఓ వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసాధారణ ప్రతిభ.. కష్టపడేతత్వం ఆమెను ఓ పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దింది. అంతేకాదు ఆసియాలోనే తొలి భారతీయ మహిళా సామాజిక పారిశ్రామిక అవార్డును సొంతం చేసుకుంది. నిషా హైదరాబాద్‌కు చెందిన ఇంటెల్ క్యాప్ సంస్థ సీఇఓ. ఆమెకు ఇటీవల లండన్‌లో జరిగిన ఏడవ ఆసియా అవార్డులో ఉత్సవంలో సామాజిక ఔత్సాహిక పారిశ్రామిక అవార్డు తీసుకున్నారు. ఈ అవార్డుల కోసం 14 విభాగాల నుంచి ఎంట్రీలు వచ్చాయి.
మేనేజర్‌గా వచ్చి డైరెక్టర్ స్థాయికి..
నిషా ఈ సంస్థలో మేనేజర్‌గా జాయిన్ అయ్యారు. ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. వ్యాపార సంస్థకు స్థిరమైన పునాది వేయటమే కాకుండా అందరి దృష్టి కేంద్రేకరించేలా ప్రతిభావంతమైన మార్పు తీసుకరావటంలో నిషా సఫలీకృతులయ్యారు. అందుకే ఆమె ఈ కేటగిరీలో ఆమె ఆసియా అవార్డ్సులో తొలి భారతీయ మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్త అవార్డు దక్కింది. నిషా తొలినాళ్లలో అమెరికాలో కన్సల్టెంట్‌లో పనిచేశారు. ఆ అనుభవంతో ఆమె హైదరాబాద్‌కు వచ్చి ఇంటెల్‌క్యాప్‌లో జాయిన్ అయ్యారు. ఆర్మీ కుటుంబం నుంచి రావట వల్ల క్రమశిక్షణ అలవడింది. అంతేకాదు వివిధ ప్రాంతాలకు ప్రయాణించటం, విభిన్న వ్యక్తులను కలుసుకోవటం వల్ల వారి నుంచి వ్యాపార మెళకువలను ఆకళింపుచేసుకున్నారు. అంతేకాదు ఇండియా, ఆప్రికా దేశాలలో గ్రామీణ జీవనవిధానాన్ని అర్ధంచేసుకున్నారు. ఈ సందర్భంగా వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చో అధ్యయనం చేసేవారు. ఇలా విభిన్న వ్యక్తులను కలుసుకోవటం వల్ల ఎంతో మార్పు తీసుకువచ్చిందని ఆమె అంటారు. ఈ మార్పే ఆమెకు అవార్డును సొంత చేసుకునేలా చేసింది.