సబ్ ఫీచర్

సాధారణ తల్లినే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను శ్రీదేవి అనే విషయాన్ని మర్చిపోండి. ఓ సాధారణ గృహిణిగా గుర్తుంచుకుంటే చాలు’ అని అంటుంది ఒకనాటి బాలీవుడ్ అగ్రనటి శ్రీదేవి. మీడియాకు దూరంగా ఉండే శ్రీదేవి తన భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న ‘మామ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాకు దగ్గరయ్యారు. ఈ చిత్రంతో పాటు కుటుంబ విషయాలను మీడియాతో ముచ్చటించిన వివరాలు ఇలా ఉన్నాయి.
‘మామ్’లో ఉన్న ప్రత్యేకత గురించి చెబుతూ అది ఓ కుటుంబానికి చెందిన ఉద్వేగభరతమైన కథ. ఓ తల్లికి, కూతురుకి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసే కథ. ఈ అంశమే నన్ను కదిలించింది. ఆ స్క్రిప్ట్ చదివిన తరువాత కథకు కనెక్ట్ అయిపోయాను. మంచి ఫీలింగ్ వచ్చింది. ఓ మంచి తల్లి అనే ఫీలింగ్ రావటంతో దేవకి పాత్రకు అంకితమైపోయాను. ట్రైలర్‌లోనే సినిమా గురించి ప్రేక్షకులకు తెలిసిపోయిందని విషయాన్ని శ్రీదేవి అంగీకరించలేదు. డైరెక్టర్ రవి ఉదయ్‌వార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాను చూడాలనే ఆసక్తిని పెంచారని అంటున్నారు. డైరెక్టర్ ఎలా చెబితే అలా నటించాను.
ఎన్నో సినిమాలు చేసిన తరువాత ఈ స్క్రిప్ట్ ఎలా కదిలించిందని అడిగితే. ఈ విషయంలో నేను మాస్టర్‌ను కాను. డైరక్టర్ మాత్రమే సబ్జెక్టుకు న్యాయం చేయగలరు. ఇంట్లో పిల్లలు కూడా ఈ క్యారక్టర్ చేస్తుంటే రియాక్ట్ అయ్యారు. కమర్షియల్‌గా సినిమాలు చేయాలనే తపన లేదు. ఈ సబ్జెక్టు నన్ను కదిలించటంతో నటిస్తున్నాను.
ఈ సినిమాలో నటించేటపుడు కుటుంబ సభ్యులను సంప్రదించారా? అని అడిగితే ప్రతి కుటుంబంలోనూ ఏదైన అంశం వచ్చినపుడు అందరూ కలసి సంప్రదించుకున్నట్లే మేము కూడా ఈ సినిమా గురించి చర్చించుకున్నాం. ఎప్పటి నుంచో ఫీమేల్ ఓరియంటేషన్ సినిమా చేయాలనే కోరిక ఉండేది. అది ఇపుడు నెరవేరింది.
మామ్‌లో నటించిన నవజుద్దీన్ సిద్దిఖీ గురించి చెబుతూ..ఆయన గొప్ప బహుముఖ ప్రజ్ఞ గల నటుడు. ఆయన అలాంటి ప్రతిభావంతుడైన నటుడని నమ్మలేకపోయాను. ఆయనతో నటించటం గొప్ప అనుభవం. నా ఇద్దరు పిల్లలు, భర్త కూడా ఈ సినిమా మంచిగా వచ్చేందుకు కష్టపడ్డారు. అన్ని రంగాల్లో మార్పు వచ్చినట్లే చిత్రరంగంలోనూ మార్పులు రావటం సహజమే. నేటి జనరేషన్ అంతా నటీనటులు గురించి ఎక్కువగా తెలుసుకోవాలిన ఆరాటపడుతున్నారు. మీ అమ్మాయి జాహ్నావి సినిమాల్లోకి వస్తే ఏమి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారని అని అడిగితే.. కష్టపడితే వందశాతం ఫలితాలు వస్తాయని అని చెబుతాను.
ఇప్పటికీ మిమ్మల్ని చూస్తే అభిమానులు క్రేజీగా ఫీల్ అవుతున్నారు అంటే చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
ఎంతో మంది దర్శకులు వద్ద పనిచేశారు. వారిలో ఎవరు మిమ్మల్ని మంచినటిగా పైకి తీసుకురాగలిగారు అని అడిగితే.. చాలామంది ఉన్నారు అని చెబుతూ శేఖర్ కపూర్ మిస్టర్ ఇండియా మంచి అవుట్‌పుట్ తీసుకురాగిలిగారు. అలాగే యాష్‌చోప్రా చాందినిలోనూ, అలాగే తమిళంలో బాలు మహేంద్రగారు వంటివారు మంచి నటిగా తీర్చిదిద్దారు. ఒకవేళ యాక్టర్ కాకపోయినట్లయితే.. పెయింటింగ్‌ను ఎక్కువగా ఇష్టపడతాను అని చెప్పారు.