సబ్ ఫీచర్

నిశ్శబ్దం ప్రశ్నిస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌనం వహించే అంశంపై మహిళలు తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు.
ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లూ ఆ అంశంపై నోరువిప్పేందుకు సిగ్గుపడే మహిళలు ఇప్పుడు నిస్సంకోచంగా చర్చిస్తున్నారు. అన్యాయాన్ని ఎదిరిస్తున్నారు. కలంపట్టి నినదిస్తున్నారు. తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడుతున్నారు. శరీర ధర్మానికి సంబంధించిన ఆ స్థితి తెలియజేయడానికి ఇష్టపడని ముదితలు ఇప్పుడు బహిరంగ చర్చకూ సై అంటున్నారు. బహిష్టు సమయంలో మూడురోజులపాటు గదిలో ఓ మూలన కూర్చునే స్థితినుంచి బయటకు వచ్చి నినదించే స్థాయికి ఎదిగారు. గూడ్స్, సర్వీస్ టాక్స్ (జిఎస్‌టి) వచ్చాక దేశంలో అన్నివర్గాలు చర్చకు ఉపక్రమించాయి. వస్తుసేవల పన్ను పేరిట కొన్ని వస్తువులపై పడిన పన్ను కొందరికి ఆనందం కలిగిస్తే మహిళల కనె్నర్రకు కారణమైంది. జిఎస్‌టిపై సందేహాల నివృత్తికోసం సంప్రదించాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టం (సిబిఈసి) చీఫ్ వనజా సర్నా ప్రకటించారు. ఈలోగానే ఆ అంశంపై మహిళాలోకం కస్సుమంది. శానిటరీ నాప్‌కిన్స్‌ను జిఎస్‌టి పరిథిలోకి తీసుకురావడాన్ని వీరంతా తప్పుపడుతున్నారు. జిఎస్‌టి వార్ రూమ్‌లో ఇదో చర్చనీయాంశమయ్యేలోగానే సామాజిక మాధ్యమాల్లో మహిళలు నిస్సంకోచంగా, ధైర్యంగా ఈ చర్యను తప్పుబట్టారు. కవితలు, వ్యాసాలు, విసుర్లు, ట్వీట్లు ఒకటేమిటి ఎవరికి తోచిన రీతిలో వారు తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు ఈ చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ఋతుధర్మం ప్రకారం మహిళలు నెలసరితో ఇబ్బంది పడేటప్పుడు తప్పనిసరిగా వాడే శానిటరీ నాప్‌కిన్స్‌పై పన్నుబాదుడు నచ్చడం లేదన్నది వారి వాదన. ఆరోగ్యభారత్ కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఇలా నిర్ణయించాడన్ని వారు ప్రశ్నిస్తున్నారు. సంప్రదాయ సంకెళ్ల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి ఆరోగ్య రక్షణ కోసం కాస్తంత ఖర్చయినా శానిటరీ నాప్‌కిన్లను వినియోగించడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు జిఎస్‌టి పరిథిలోకి తీసుకురావడంతో వాటి ధర పెరుగుతుంది. గ్రామీణ భారతంలో ఈ భారాన్ని మోయడం ప్రజలకు సాధ్యం కాదు. నగరాల్లో విస్తృతంగా వీటిని వినియోగించే ఆధునిక మహిళలు కూడా దీనిని తప్పుబడుతున్నారు. ఇదేదో రహస్యంగా, గుట్టుగా చెప్పుకోవాల్సిన అంశమే కాదంటూ చర్చలకు సిద్ధమయ్యారు. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమంలో ఈ విషయంలో కవితలు రాసి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తోట సుభాషిణి అనే వర్థమాన కవయిత్రి తన ఆవేదనను కవిత రూపంలో వెల్లడించార. ‘అరచేతితో ఎర్రటి సూర్యుడిని ఆపగల శక్తి వాటి సొంతం...నలుగురిలో నామోషీ పడకుండా ముందుకు సాగేందుకు సహకరించగల ఆసనం.. అనాలోగ్యంపాలుకాకుండా.. ఆడపుట్టుక చెంతచేరిన శానిటరీ నేప్‌కిన్’ అని రాస్తూ ‘దయలేని మానవత్వాన్ని దారిద్య్రం వైపు మళ్లిస్తే ఆరోగ్యాన్ని కీపాడ్‌లలో చూడటమే.. అనారోగ్యాన్ని బాత్రూముల్లో పుట్టించడమే’నని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆవేదన, ఆక్రోశం, ఆగ్రహం కలగలసిన కవితలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతున్నాయి. వైష్ణవి అనే మరో అభ్యుదయ కవయిత్రి కాస్త ఘాటుగానే స్పందించింది. ‘రక్తపుటేరులై ప్రవహిస్తున్న ఆత్మాభిమానానికి ఏ అడ్డుకట్ట వేస్తారు?...ఇన్నాళ్లూ హక్కులన్నీ కొల్లగొట్టి మూలన కూర్చోబెట్టింది చాలు..’అంటూ ఇలాంటి తలాతోక నిర్ణయాలతో చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని సలహా ఇచ్చింది. వారి కోరికంతా శానిటరీ నాప్‌కిన్‌లను జిఎస్‌టి పరిథి నుంచి తప్పించాలని. ప్రభుత్వం వారి న్యాయబద్ధమైన డిమాండ్‌ను అంగీకరిస్తుందని ఆశిద్దాం.

-కంచర్ల శ్రీనివాస్