మెయిన్ ఫీచర్

ఫ్యాషన్.. సెనే్సషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన జీవనసరళిలో ఆధునికీకరణ ప్రతి పార్శ్వంలో కనిపిస్తోంది. నాగరికత పెరగాలి, కాని అవి వెర్రితలలు వేయకూడదు. కట్టు, బొట్టు, వస్తధ్రారణ, అలంకరణ, సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. వస్తధ్రారణ, అలంకరణ ఎబ్బెట్టుగా ఉండకూడదు. ప్రస్తుతం సహజత్వంకన్నా కృత్రిమత్వం ప్రతి అంశంలో అధికంగా కనిపిస్తోంది. అనుకరణ, అనుసరణ అది ఆచరణీయమా, కాదా అన్న విషయాన్ని ఆలోచించకుండా గుడ్డిగా ఆచరిస్తున్నారు. ఫ్యాషన్ పేరిట ఎబ్బెట్టుగా వ్యవహరిస్తున్నారు. వస్త్రాలంకరణ
విషయంలో వింత పోకడలకు పోతున్నారు.
స్ర్తి వస్తధ్రారణలో జాగ్రత్తలు తీసుకోకపోవడంవల్ల ఎన్నో అనర్థాలు మనం చూస్తున్నము. వస్తధ్రారణలో జాగరూకత పాటించకపోతే వాళ్ళ పట్ల గౌరవభావం సన్నగిల్లే ప్రమాదముంది. వస్తధ్రారణ, అలంకరణ ప్రాంతాలవారీగా మారుతూ ఉంటుంది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే ప్రత్యేకం, విలక్షణం. ఏ ప్రాంతీయ ఆచారాన్ని వస్తద్రారణ విషయంలో విమర్శించడానికి తావులేదు. దానివల్ల స్పర్థలు ఏర్పడే అవకాశముంది. అలంకరణ, వస్తధ్రారణ మతాన్ని బట్టికూడా మారుతూ వుంటుంది. యవ్వనంలో వుండే యువతులకు శరీరాన్ని అంతటినీ కప్పి వుంచే చుడీదార్, పంజాబ్ డ్రెస్ లాంటి వస్త్రాలంకరణ ఎంతగానో బాగుంటుంది. గ్రామీణ సంస్కృతిని, సంప్రదాయాన్ని తెలియజేసే విధంగా లంగా ఓణీని చాలా తక్కువ శాతం యువతులు ధరిస్తున్నా వీటివలన యువతులు సాంప్రదాయంగా కనిపిస్తారు.
ఏ మతమైనా, ఆచారమైనా వస్తధ్రారణ, అలంకరణ వ్యక్తి గౌరవాన్ని ఇనుమడింపజేయాలి. అవి సంస్కృతిని, సంప్రదాయాల్ని ప్రతిబింబింపచేయాలి. హుందాగా ధరించే వస్త్రాలు వ్యక్తులకు నిండుదనాన్ని చేకూర్చడమే గాక, వారిపట్ల గౌరవభావాన్ని పెంచుతాయి. దేశంలో కొన్ని చోట్ల వస్తధ్రారణ, ఆభరణాలు ధరించడం, అలంకరణ చేసుకోవడం అధికంగాను, మరికొన్ని చోట్ల వాటిని అప్రధానంగా భావిస్తారు. శరీరమంతా నిండుగా ధరించే ముస్లిం స్ర్తిల వస్తధ్రారణ వాళ్ళ పట్ల ఎంతో గౌరవభావాన్ని పెంచుతుంది.
భారతీయ మహిళలు చీరను ధరించడంలో ఎంతో హుందాతనముంది. ఈ చీర ధరించే భారతీయ సంప్రదాయానికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవముంది. నేటి తరం పిల్లల విషయానికొస్తే వాళ్ళ హెయిర్ స్టైల్ చాలా చోట్ల వెగటు పుట్టిస్తుంది. సినిమాల్లో హీరోలు పాత్ర వైవిధ్యం కోసం మారుస్తున్న హెయిర్ స్టైల్స్‌ను గుడ్డిగా అనుకరిస్తూ వికృతంగా ప్రవర్తిస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్‌కు ప్రాధాన్యత పెరిగిన ఆధునిక సమాజంలో యువతులు ధరించే దుస్తులు ఫ్యాషన్ పేరిట అదోరకంగా వుంటున్నాయి. పిల్లలకు దుస్తులు కొనేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాషన్‌కు ఎంత ప్రాధాన్యతనిచ్చినా పిల్లలకు కొనే దుస్తులు ఎబ్బెట్టుగా ఆక్షేపణీయంగా ఉండకూడదు. ప్రధానంగా మహిళలు వాళ్ళ వయస్సును దృష్టిలో పెట్టుకొని వస్త్రాలను ఎంపిక చేసుకొంటే ఉచితంగా ఉండడమే కాకుండా ఆ వస్త్రాలంకరణ గౌరవప్రదంగా ఉంటుంది.
ఆడపిల్లలు జీన్స్, బిగుతుగా శరీరాన్ని అంటిపెట్టుకునే వస్త్రాలు ధరిస్తే అవి సంప్రదాయాన్ని, సంస్కృతిని గౌరవించేవాళ్ళకి ఆక్షేపణీయంగా ఉంటాయి. స్ర్తిల వస్తధ్రారణ కారణంగా ప్రస్తుత సమాజంలో కొన్ని అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పక తప్పదు. వస్తధ్రారణ పరంగా ఆకర్షణకు గురై యువతీ యువకులు పక్కదారి పడుతున్నారు. ఎవరి జాగ్రత్తలో వారుంటే సమాజాన్ని తప్పుపట్టవలసిన, నిందించవలసిన అవసరముండదు. వస్తధ్రారణ, శిరోజాలంకరణ తదితర విషయాల్లో తల్లిదండ్రులతోపాటు విద్యార్థినీ విద్యార్థులకు కొన్ని జాగ్రత్తలు ఉపాధ్యాయులు, అధ్యాపకులు చెప్పవలసిన అవసరం ఉంది. ఫ్యాషన్ పేరిట ఎబ్బెట్టుగా అలంకరణ, వస్తధ్రారణ యువతులు చేసుకుంటే వాటివల్ల కలిగే అనర్థాలను, నష్టాలను వాళ్ళకు వివరించి, గౌరవప్రదంగా వస్త్రాలంకరణ, శిరోజాలంకరణ చేసుకొనే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దేశ గౌరవంగా ఇనుమడింపజేసే విధంగా తల్లిదండ్రులు, విద్యాలయాలు కృషిచేయాలి.

-రాజ్‌కుమార్