సబ్ ఫీచర్

మహిళా ఖైదీల జీవితాలు ఛిద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షణికావేశంలో చేసే నేరాలు మహిళల జీవితాలను చిధ్రం చేస్తున్నాయి. అయినవారికి దూరమై మూగవేదనతో బతికే మహిళా ఖైదీల సంఖ్య నానాటికి పెరిగిపోవటం ఆందోళన కలిగించే అంశం. 2015నాటికి మనదేశంలో 17,384మంది మహిళా ఖైదీలున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో వెల్లడించింది. ఇందులో 32శాతం మంది దోషులుగా తేలగా.. మరో 66శాతం మంది అండర్ ట్రయల్ విభాగంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అధిక సంఖ్యలోఅంటే దాదాపు 1,033 మంది ఖైదీలు ఉన్నట్లు వెల్లడైంది. మధ్యప్రదేశ్‌లో 603, పంజాబ్‌లో 543 మంది ఖైదీలున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లా జైళ్లలోనే అధిక సంఖ్యలో మహిళా ఖైదీలు మగ్గుతున్నట్లు వివరాలు తెలియజేస్తున్నాయి. జిల్లా జైళ్లలో దాదాపు 41.4శాతం, సెంట్రల్ జైలులో 33.5శాతం, కేవలం 17శాతం అంటే 2,985మంది మాత్రమే ప్రత్యేకంగా మహిళలకు కేటాయించిన జైలులో ఖైదీలుగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఖైదీగా ఉంటూ మృత్యువాతపడుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతుంది. 2015లో 51మంది మహిళాఖైదీలు చనిపోగా.. ఇందులో సహజంగా చనిపోయినవారు 48మంది, ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడేవారి సంఖ్య కూడా ఉత్తరప్రదేశ్‌లోనే అధికంగా ఉంది. ఇక్కడ పదిమంది, పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది మంది, పంజాబ్‌లో ఆరుగురు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పుదిచ్చేరిలో ఒక్కొక్కరు చొప్పున ఆత్మహత్య చేసుకున్నారు. జైళ్లలో మెడికల్ సిబ్బంది కూడా తక్కువగా ఉన్నట్లు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల వివరాలు వెల్లడిస్తున్నాయి. జైళ్లలో పనిచేసేందుకు 2,993మంది మెడికల్ సిబ్బంది పోస్టులు మంజూరుకాగా.. కేవలం 1,866 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇదే సందర్భంలో మహిళా జైలు అధికారిణుల సంఖ్య 14.6శాతానికి పెరిగింది.