బిజినెస్

చారిత్రక స్థాయికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: రిటైల్ ద్రవ్యోల్బణం చారిత్రక స్థాయికి తగ్గింది. గత నెల జూన్‌లో 1.54 శాతంగానే నమోదైంది. 2012 జనవరిలో ప్రస్తుత కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సిరీస్ మొదలవగా, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ స్థాయిలో తగ్గినది లేదు. కూరగాయలు, పప్పు్ధన్యాలు, పాల ఉత్పత్తులు తదితర ఆహారోత్పత్తుల ధరలు తగ్గడమే ఇందుకు కారణం. నిరుడు జూన్‌లో 5.77 శాతంగా ఉందని కేంద్ర గణాంకాల కార్యాలయం బుధవారం తెలిపింది. మరోవైపు ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్ విలేఖరులతో మాట్లాడుతూ తాజా గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు అద్దం పడుతున్నాయన్నారు.