తెలంగాణ

అట్టహాసంగా హరితోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 12: తెలంగాణ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం మూడవ విడత కార్యక్రమం కరీంనగర్‌లో బుధవారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది. వేలాదిమంది విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు, మహిళల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్ర మంత్రులు జోగు రామన్న, ఈటల రాజేందర్‌లతో కలిసి కరీంనగర్‌లోని ఎల్‌ఎండి కట్ట దిగువన మొక్కను నాటి మూడో విడత హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడ సిఎం మొక్క నాటగానే రాష్టమ్రంతటా హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. ఇక నేటి నుంచి రాష్ట్రంలో వన మహోత్సవ కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం కాగా, గత రెండు విడతల్లో రాష్ట్రంలో 49కోట్ల మొక్కలు నాటగా, మూడవ విడతగా 40కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం గత రెండు విడతల అనుభవాలను పరిగణలోకి తీసుకుని మూడవ విడతను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాటిన ప్రతీ మొక్క మానుగా ఎదిగేవరకు వాటి సంరక్షణకు ప్రత్యేకంగా గ్రీన్ బ్రిగేడ్‌లను ఏర్పాటు చేసింది. అలాగే ఒక్కొ అధికారికి 500మొక్కల రక్షణ బాధ్యతలను అప్పగించింది. అటు చెట్లను రక్షించిన సంస్థలు, వ్యక్తులకు అవార్డులతోపాటు నగదు పారితోషికాన్ని అందజేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలతోపాటు ఆసుపత్రులు, రహదారుల ఇరువైపులా మొక్కలను నాటడంతోపాటు గృహావసరాలకు ఉపయోగపడే పండ్లు, పూల మొక్కలను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించి, ఆ దిశగా మొక్కలను సిద్ధం చేసింది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించేందుకు విద్యార్థులతోపాటు ప్రజలందరినీ హరితహారంలో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. మొక్కల సంరక్షణలో ప్రజలతోపాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులను భాగస్వాములను చేసి ‘గ్రీన్ డే’ను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున భాగస్వాములు కావాలని సూచించారు.