తెలంగాణ

47కోట్ల మొక్కలను పెంచుతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి సుమారు 50 కోట్ల మొక్కలను నాటుతుండగా, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వర్తమాన సంవత్సరంలో దాదాపు 47 కోట్ల మొక్కలను నాటుతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి పాల్గొని వెస్ట్‌జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటంతో పాటు పచ్చదనం శాతాన్ని కూడా పెంపొందించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో గ్రీన్ కవరేజీని 33 శాతానికి పెంచేందుకు ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో చేపట్టిన ఎస్‌ఆర్‌డిపి ప్రజెక్టులో భాగంగా చేపట్టిన పలు ఫ్లై ఓవర్ల నిర్మాణాల కోసం స్థల సేకరణ నిమిత్తం తొలగించిన చెట్లను తిరిగి ట్రాన్స్‌లొకేషన్ చేస్తున్నామని, ఈ ప్రక్రియ ఎంతో విజయవంతంగా కొనసాగుతుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా, డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, అంబర్‌పేట ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డిలతో కలిసి శివం ఎదురుగా ఉన్న అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆవరణలో బుధవారం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రీన్ కవరేజీని 33 శాతానికి పెంచేందుకు గాను ప్రభుత్వం 230 కోట్ల మొక్కలను నాటే లక్ష్యంతో ముందుకెళ్తుందన్నారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ మాట్లాడుతూ గత సంవత్సరం నాటిన మొక్కల్లో సుమారు 90శాతం బతికే ఉండగా, ఈ ఏటా నాటుతున్న మొక్కల్లో 95 శాతం మొక్కలు మనుగడ సాగించేలా చర్యలు చేపట్టామని వివరించారు.