తెలంగాణ

రాష్ట్రానికి త్వరలో ట్రైబల్ వర్సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: తెలంగాణలో త్వరలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటవుతుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. బుధవారం కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జావడేకర్‌తో సమావేశమై విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలు తీరును సమీక్షించారు. తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయింపును పూర్తి చేసినందున గిరిజన వర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కేబినెట్ ఆమోదించిన అనంతరం పార్లమెంటులో ప్రతిపాదించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణలో కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చినప్పుడు ప్రకాశ్ జావడేకర్‌తో చర్చించారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలను పంపిస్తే పరిశీలించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రూసా కింద తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన 49 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసేందుకు కేంద్ర మంత్రి వెంకయ్య అంగీకరించారు. అయితే ఈ ఖర్చుకు సంబంధించిన యుటిలైజేషన్ సర్ట్ఫికెట్ పంపటం తప్పనిసరని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అదనంగా అడుగుతున్నవి కొత్త ప్రతిపాదనలకు సంబంధించినవి కనుక, వాటిని వేరుగా పరిశీలించి అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని వెంకయ్య వివరించారు.