రాష్ట్రీయం

కాంగ్రెస్‌ను తొక్కేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 15: కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాష్ట్ర మున్సిపల్ మంత్రి కె తారక రామారవు పిలుపునిచ్చారు. పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకునే నేతలు మహబూబ్‌నగర్ జిల్లావారేనని, వాళ్లకు ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి పర్యటించారు. మహబూబ్‌నగర్‌లోని హరితవనం పార్కు ప్రారంభించి రోప్‌వేపై తిరిగారు. పట్టణంలో 205 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ను అనుసంధానం చేసుకుని 235 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ పనులను శ్రీరామకొండ, కుస్ముద్‌పల్లి, చెందాపూర్‌లలో ప్రారంభించారు. నారాయణపేటలో 60 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నారాయణపేట బిజెపి మున్సిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, ఆరుగురు కౌన్సిలర్లు మంత్రి కెటిఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. మహబూబ్‌నగర్ జెడ్పీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ 65 ఏళ్ల కాంగ్రెస్ గబ్బును తుడిచేస్తున్నామని, బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కాలని పిలుపునిచ్చారు. తెలంగాణను భ్రష్టుపట్టించిన కాంగ్రెస్, తెదేపాలకు భవిష్యత్‌లో స్థానం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. కొందరు నేతలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేసులపై కేసులు వేస్తూ రైతు కళ్లలో మట్టికొడుతున్నారన్నారు. వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి 17 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. రాష్ట్రావిర్భావం తరువాత అన్ని వర్గాల పిల్లల కోసం 500 గురుకులాలు ప్రారంభించామన్నారు. కోయిల్‌సాగర్ బ్యాక్‌వాటర్ నుంచి 235 కోట్ల వ్యయంతో గ్రామీణ ప్రాంతాలకు నదీ జలాల తాగునీరు అందించబోతున్నామన్నారు. 49 వేల కిలోమీటర్లమేర మిషన్ భగీరథ పైపులు ఏర్పాటు చేస్తున్నామని, పల్లెల్ల్లో లక్ష కిలోమీటర్ల పైప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు. 17 వేల కోట్లతో ఓవర్‌హెడ్ ట్యాంకులను నిర్మిస్తున్నామన్నారు. 19 రిజర్వాయర్ల ద్వారా ఇంటింటికి మంచినీరును అందించనున్నామన్నారు. బహిరంగ సభలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం.. మహబూబ్‌నగర్ హరితవనం పార్కులో ఏర్పాటు చేసిన రోప్‌వేలో ప్రయాణిస్తున్న మంత్రి కెటిఆర్