Others

యమా జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ గ్లామర్ భామ ప్రియాంక చోప్రా జోరుమీదుంది. హాలీవుడ్ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించిన ప్రియాంక తాజాగా మూడో చిత్రానికి ఓకే చెప్పింది. నటన, గ్లామర్ పుష్కలంగా ఉన్న ప్రియాంకపై హాలీవుడ్ ఆసక్తి చూపుతోందట. ఆమెను హీరోయిన్‌గా తీసుకునేందుకు హాలీవుడ్‌లో సినీమేకర్స్ సంప్రదిస్తున్నారట. ‘బేవాచ్’, ‘క్వాంటికో’లతో సంచలనం రేపిన ప్రియాంక, తాజాగా నటించే చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. రెబల్ విల్సన్, ఆడం డివైవ్, లియాం హెమ్స్‌వర్త్‌లతో కలిసి నటించనుందని టాక్. భారీ బడ్జెట్‌తో హైటెక్ విలువలతో తెరకెక్కనున్న ఈ చిత్రం తరువాత తన ఇమేజ్ మరింత పెరుగుతుందని ఆశిస్తోంది ప్రియాంక.