కరీంనగర్

సమాచారమిస్తే..చావ బాదారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 17: సమాచారమిస్తే చావ బదుతారా..? సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తారా..? పైగా బయటకు చెబితే ఎన్‌కౌంటర్ చేస్తామంటూ బెదిరిస్తారా..? ఇది ప్రజాస్వామ్యమా ? లేక రాచరిక రాజ్యమా ? అంటూ దళిత కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దళితులపై అక్రమంగా కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులపై కేసు నమోదు చేయడమేకాక కమిషన్ వేసి విచారణ జరిపించాలని, అక్రమంగా పెట్టిన కేసులను భేషరతుగా తీసివేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని జైలు అధికారుల అనుమతితో సోమవారం ఉదయం కాంగ్రెస్ నేతలు సుద్దాల దేవయ్య, ఆరెపల్లి మోహన్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ తదితరులు కలిసి ఓదార్చారు. జరిగిన ఘటన గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్‌అండ్‌బి అతిథి గృహాంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య మాట్లాడుతూ సాక్షాత్తు సిఎం తనయుడు కెటిఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళితులపై జరిగిన ఈ అమానుష ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులు ఈ రకంగా చిత్రహింసలు పెట్టిన తీరు తన 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. వారం పాటు చికిత్స పొందుతున్నా, వారు లేచి నిలబడే పరిస్థితి లేదని, ఈ ఘటనపై ప్రత్యేక కమీషన్ వేసి విచారణ జరిపించి, బాధ్యులైన పోలీసు అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ విఫ్ ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ఘటనలో పాల్గొన్న వారిపై మాత్రమే కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు ప్రభుత్వం మెప్పు పొందడానికి సంబంధం లేని, సమాచారం అందించిన దళితులపై అక్రమంగా కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై మండిపడ్డారు. పైగా బయటకు చెబితే ఎన్‌కౌంటర్ చేస్తామంటూ బెదిరించడం దుర్మార్గమని, తాము సిగ్గుపడుతున్నామంటూ పేర్కొన్నారు. ఈ విషయంపై బాధిత కుటుంబాలు రాష్ట్ర డిజిపికి మొరపెట్టుకున్నా స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. నక్సలైట్లపై కూడా ఇలా థర్డ్ డిగ్రీ ఉపయోగించిన సందర్భాలు లేవని చెప్పారు. మాజీ జడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ దళితులను సిఎం చేస్తానని చెప్పిన కెసిఆర్ ఆయనే సిఎం గద్దెపై కూర్చున్నారని, ఇప్పుడు దళితులపై అక్రమంగా కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మర్మాంగం మినహా శరీరమంతా గాయాలే ఉన్నాయని, దళిత ప్రజాప్రతినిధులు పరామర్శించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేసులో ఉంటే చట్టపరంగా శిక్షించాలే తప్ప ఈ రకంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించడం సరికాదని, ఇప్పటికైన బలహీన, దళిత వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వారికి న్యాయం చేయాలని ప్రభాకర్ కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కర్ర రాజశేఖర్, ఆకుల ప్రకాష్, వొంటెల రత్నాకర్, నాగి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.