కరీంనగర్

అన్నదాతలకు తీపి కబురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 17: ఇక నుంచి కర్షకులకు కరెంట్ కష్టాలు తీరనున్నాయి. రెండేళ్ల క్రితం వరకు ఓవైపు వర్షాభావం, మరోవైపు కరెంట్ కోతలతో అతలాకుతలమైన అన్నదాతలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇప్పటికే ఎరువుల కోసం రూ.8వేలు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా 24గంటల విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో నేటి (సోమవారం) అర్దరాత్రి నుంచి 24గంటల కరెంట్ సరఫరా చేసే ప్రయోగాత్మక కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదిక కాబోతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరా చేయడానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం..ఇక్కడి ఫలితాలను సమీక్షించి సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా దీనే్న అమలు చేసేందుకు చర్యలు చేపట్టనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో మొత్తం 3లక్షల 105 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అలాగే సిరిసిల్ల సెస్ పరిధిలో సుమారు 50వేల కనెక్షన్లు ఉన్నాయి. వీటికి నేటి అర్ధరాత్రి నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా కాబోతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11.346మిలియన్‌ల యూనిట్లు వినియోగంలో ఉండగా, 40శాతం మేర వ్యవసాయ రంగానికే వాడుతున్నారు. మిగిలిన యూనిట్లు మిగితా రంగాల్లో వినియోగంలో ఉంది. ఇప్పటికే వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు 58కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్లను నిర్మించారు. అలాగే కోటి 30లక్షల వ్యయంతో మరో 15 సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. మొత్తానికి కరెంట్ కష్టాలతో అల్లాడిన అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురునందిచంగా, ఉమ్మడి జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరాకు అన్ని ఏర్పాటు చేశామని, సోమవారం మిడ్‌నైట్ నుంచి అమలు చేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఇ మాధవరావు తెలిపారు. ఇప్పటివరకు ఉన్న ఆటోమెటిక్ స్టార్టర్లు తొలగించుకోవాలని, వాటిని తొలగించకపోతే నిరంతర విద్యుత్ సరఫరాతో మోటార్లు ఆన్‌లో ఉండిపోయి ఖాళీపోయే అవకాశాలున్నాయని, దీనిని గమనించి తొలగించుకోవాలని ఆయన రైతులకు సూచించారు.