శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అంచెలంచెలుగా.. వెంకయ్య రాజకీయ ప్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూలై 17: బహుభాషా కోవిదుడైన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఎన్‌డిఎ తరపున ఉప రాష్టప్రతి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. ఈ మేరకు సోమవారం అధికార ప్రకటన వెలువడగా మంగళవారం ఉదయం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈయన రాజకీయ ప్రస్థానం ఎంతో ఆదర్శప్రాయమైనదని విశే్లషకులు సైతం పేర్కొంటుంటారు. రాజకీయ నేతగా వైరి పక్షాలపై దీటైన విమర్శలు గుప్పించే నైజానికి వెంకయ్యనాయుడు ఇక దూరం కానున్నారనే చెప్పాలి. అద్భుతమైన రీతిలో ఆకట్టుకునే ప్రాశ, యాస భాషలతో ఆయన చేసే ప్రసంగాలు ఎంతో ప్రత్యేకతతో కూడుకుని సగటు నుండి పామర జనం వరకు ఆకర్షితులయ్యేలా చేసేది. అయితే భారత రాజ్యాంగం ప్రకారం రాష్టప్రతి, ఉప రాష్టప్రతి, చట్టసభల్లో అధ్యక్షులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించే ఉప రాష్టప్రతి పదవిని లాంఛనప్రాయంగా అందుకోనున్న వెంకయ్యనాయుడు భవిష్యత్తులో విలక్షణమైన పాత్రలోకి వెళ్తున్నారనే సంగతి తేటతెల్లం అవుతోంది. రాజకీయ ఉపన్యాసాలు చేయడమనేది ఉప రాష్టప్రతిగా వీలుపడని సంగతి. ఈ పదవి అనంతరం చాలామంది రాష్టప్రతి స్థానాల్లోకి చేరుకున్నారు. ఆ కోవలో వెళతారా, లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఇదిలావుంటే వెంకయ్య రాజకీయ ప్రస్థానం ఎన్నో ఉద్ధాన పతనాలతో కూడుకున్నదనే చెప్పాలి. ఈయన 1949 జూలై 1వ తేదీన జిల్లాలోని ఇప్పటి వెంకటాచలం మండలం చవటపాలెం గ్రామంలో జన్మించారు. బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్నారు. పాడి రైతు కుటుంబానికి చెందిన వెంకయ్యనాయుడి తల్లిని ఆవు కొమ్ములతో పొడవడంతో మరణించిందని చెబుతుంటారు. తల్లి మరణం అనంతరం ఈయన మేనమామ ఊరైన అదే మండలంలోని మంగలగుంట (ఇప్పటి శ్రీరామాపురం) చేరుకున్నారు. ఈయన పాఠశాల విద్యాభ్యాసంలో ఎంతో చురుగ్గా రాణించారు. ఇక కళాశాలలో అడుగుపెట్టినప్పటి నుండి విద్యార్థి నేతగా క్రియాశీలకంగా వ్యవహరించారు. నెల్లూరులోని విఆర్ కళాశాల విద్యార్థి రాజకీయాలకు నెలవుగా ఉండేది. అక్కడ వెంకయ్య విద్యార్థి నేతగా అందరి మన్ననలు పొందారు. ఇదేక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ వంటి క్రమశిక్షణ కలిగిన సంస్థలో తనదైన పాత్ర పోషించారు. అక్కడి పెద్దల ఆశీస్సులతో 1977లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో జనసంఘ్ అభ్యర్థిగా ఒంగోలు స్థానం నుండి బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. అయినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా జనసంఘ్ పార్టీ కార్యకలాపాలలో కొనసాగుతూ వచ్చారు. ఈ పార్టీ తరపున జాతీయ నేతగా ఖ్యాతి గడిస్తున్న అటల్‌బిహారీ వాజ్‌పాయి నెల్లూరుకు వచ్చిన సందర్భంలో ఊరంతా మైకులో అరుస్తూ ప్రచారం చేశానని వెంకయ్య చెప్పుకునేవారు. అలాంటి సందర్భాలలో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు సొమ్ములు లేక స్తంభాలెక్కి జెండాలు, బ్యానర్లు కట్టేవాడినని, గోడలపై పోస్టర్లు అతికించేవాడినని చెప్పుకునేవారు. ఆ తర్వాత ఏడాదికల్లా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు రావడంతో ఉదయగిరి నుండి జనసంఘ్ అభ్యర్థిగా బరిలో నిలిచి అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అప్పట్లో ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకై నెల్లూరు నుండి ఉదయగిరికి ఆర్టీసీ బస్సులో వెళ్లానని ఆ సందర్భంలో సీట్లు లేకున్నా నిలబడే వేలాడుతూ ప్రయాణం చేశానని వెంకయ్యనాయుడే తన గత స్మృతులుగా వివిధ సందర్భాలలో చెప్పుకుంటారు. అలాగే ఆ ఎన్నికలకు నామినేషన్ వేసిన సందర్భంలో తన జేబులో కేవలం 13 రూపాయలు మాత్రమే ఉన్నాయని, అయితే నియోజకవర్గంలోని తన సొంత సామాజికవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు ఓ జీపును ఏర్పాటుచేసి ఎన్నికల ప్రచారంలో తోడ్పాటు అందించిన సంగతి గుర్తుచేసుకుంటారు. అలాగే 1983 నాటికి జనసంఘ్ అంతరించి బిజెపి ఆవిర్భవించింది. 1983లో జరిగిన ఎన్నికల్లో సాక్షాత్తు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఉదయగిరికి వచ్చి వెంకయ్యకు వ్యతిరేకంగా విమర్శలు గుప్పించి వెళ్లినా ఆయన రెండో పర్యాయం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1985లో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు రాగా ఆయన ఆత్మకూరు నుండి పోటీచేసి స్వల్ప తేడాతో బిఎస్‌ఆర్ చేతిలో ఓటమిపాలయ్యారు. తన రాజకీయ జీవితంలో ఉదయగిరి మినహాయిస్తే మరెక్కడా, ఎప్పుడూ గెలుపొందిన దాఖలమే లేకపోవడం వెంకయ్య రాజకీయ జీవితంలో ఓ విశేషం. 1999లో ఈయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత వాజ్‌పేయి కేబినెట్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేస్తూ కొన్నాళ్లకు ఆ పదవి నుండి దూరమై బిజెపి జాతీయ అధ్యక్షులుగా నియమితులయ్యారు. 2004 ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి ఓటమితో ఆ తర్వాతి సంవత్సరం అధ్యక్ష పదవి నుండి ఉపాధ్యక్ష పదవికి చేరుకున్నారు. అయినా ఏమాత్రం మనస్థాపం చెందకుండా బిజెపి అభ్యున్నతికై తనవంతు పాత్ర పోషిస్తూ వచ్చారు. 2014లో ఎన్‌డిఎ తిరిగి విజయఢంకా మోగించడంతో నరేంద్రమోదీ కేబినెట్‌లో పట్టణాభివృద్ధి శాఖా మంత్రిగా రాణిస్తూ ప్రస్తుతం ఉప రాష్టప్రతి అభ్యర్థిగా రేసులో నిలుస్తుండడం విశేషం.