రాష్ట్రీయం

వేగంగా భూసేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: మిడ్‌మానేరు ప్రాజెక్టు 8వ ప్యాకేజీ కింద పెండింగ్‌లో ఉన్న 200 ఎకరాల భూసేకరణ వెంటనే చేపట్టాలని నీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావు ఆదేశించారు. ప్రాజెక్టు కాలువల పనులను సైతం యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రాజెక్టు పనులు, పునరావాసంపై సమీక్షించారు. మిడ్ మానేరులో 10 టిఎంసి నీళ్లు నిల్వ చేయబోతున్నట్లు తెలిపారు. దీని ద్వారా 80 వేల ఎకరాలు సాగులోకి తేవాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. కాలువలు పూర్తిస్థాయిలో తీసుకురాకపోతే ఈ లక్ష్యం నెరవేరదని మంత్రి హెచ్చరించారు. కాలువలను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి భూసేకరణ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ను మంత్రి కోరారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో కాలువలను తనిఖీ చేస్తే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించవచ్చన్నారు. మిడ్‌మానేరు ముంపు బాధితులకు పరిహారం, పునరావాస పథకం సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ దగ్గర దీనికి సంబంధించి నిధులు ఉంచామన్నారు. మిడ్‌మానేరు ముంపునకు గురయ్యే గ్రామాల పరిస్థితి, వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చింతల్ ఠాణా, కొదురు పాక, శాబాసుపల్లి, కొడిముంజ, చీర్లవంచ, అనుపురం, ఆరేపల్లి, సంకేపల్లి, రుద్రవరం, వరదవెల్లి గ్రామాల నిర్వాసితులకు ఇప్పటి వరకు జరిగిన పరిహారం చెల్లింపులను మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ముంపునకు గురయ్యే గ్రామాల్లో విద్యుత్ లైన్లు తొలగించాలని, విద్యుత్ కేటగిరి కన్వర్షన్ చేయాలన్నారు. కాళేశ్వరం, తుపాకులగూడెం ప్రాజెక్టుల భూసేకరణ పురోగతినీ మంత్రి సమీక్షించారు. ప్రభుత్వ స్పెషల్ సిఎస్ జోషి, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి వికాసరాజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఈఎన్‌సి మురళీధరరావు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.