తెలంగాణ

ప్రభుత్వానికి చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: సాంఘిక, బిసి, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందిగా కేవలం మహిళలను మాత్రమే నియమించేందుకు నిర్దేశించిన జీవో 1274ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్‌కు చెందిన కె సత్యనారాయణ మరి కొందరు ఈ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు దీన్ని విచారించి జీవోను సస్పెండ్ చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాది ఎస్ సత్యం రెడ్డి వాదనలు వినిపిస్తూ, అన్ని కేటగిరీల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మహిళలను మాత్రమే నియమించాలని జీవోలో పేర్కొన్నారని, కాని తెలంగాణ రాష్ట్ర సబార్టినేట్ రూల్స్ ప్రకారం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని మాత్రమే ఉందన్నారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు తూట్లు పొడిచే విధంగా జీవో ఉందని, సమాన ఉద్యోగావకాశాలు కల్పించాల్సి ఉందని వాదించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇప్పటికే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని, ఈ ఉద్యోగాలను మహిళలకు మాత్రమే రిజర్వు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. అనంతరం ఈ జీవోను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టులో బిజెపి పిల్
మియాపూర్ భూస్కాంపై సిబిఐ చేత దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ బిజెపి అధికారప్రతినిధి ఎం రఘునందన్‌రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ కేసును సిబిఐకు బదలాయించాలని కోరారు. ఈ కేసులో కీలక వ్యక్తులను ఇంతవరకు అరెస్టు చేయలేదని, ఈ భూముల అన్యాక్రాంతం వల్ల రాష్ట్ర ఖజానాకు వెయ్యి కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఈ కేసును సిబిఐకు అప్పగించడమేకాకుండా హైకోర్టు పర్యవేక్షించాలని కోరారు.