కృష్ణ

ఇది నూజివీడు రోడ్డే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 19: చిన్నపాటి వర్షం వస్తేనే నూజివీడు రోడ్డు తన స్వరూపం కోల్పోతోంది. వర్షం నీటితో ముంపునకు గురవుతుండటంతో వాహన చోదకులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. విజయవాడ నగరం నుంచి నూజివీడు, విస్సన్నపేట, ఆ పై ప్రాంతాలకు వెళ్ళేందుకు అజిత్‌సింగ్‌నగర్ మీదుగా వెళ్ళే రోడ్డే ఏకైక మార్గం. అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం పరిసర ప్రాంతాల్లో ఉండే లక్షలాది స్థానికులతో పాటు నూజివీడుకు నిత్యం రాకపోకలు సాగించే వేలాది వాహనాలకు వర్షం నీటి ముంపు తప్పడం లేదు. వేలాది వాహనాల్లో లక్షలాది మంది ప్రయాణించే నూజివీడు రోడ్డు అభివృద్ధిపై ఇటు మున్సిపల్ శాఖ కాని, రోడ్లు భవనాల శాఖ గానీ పట్టించుకోక పోవటంతో సమస్య మరింత జటిలమవుతోంది. రోడ్డుపై పడుతున్న వర్షం నీటికి పారుదల లేక ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతోంది. ఒకపక్క బుడమేరు కరకట్ట, మరోపక్క రోడ్డు సెంట్రల్ డివైడర్ ఉండటంతో నీటి పారుదలకు అవకాశం లేక నిలిచిపోతున్న తీరు గమనార్హం కాగా ఈ నీటి పారుదలకు బుడమేరు కరకట్ట వైపు చిన్నపాటి సైడ్ డ్రైయిన్ నిర్మించారు. ప్రస్తుతం ఈ డ్రైయిన్ కరకట్ట మట్టితో పూడుకు పోవడంతో నీరు నిల్వ వుంటోంది. వర్షం పడితే గంట, రెండు గంటలపాటు నీరు నిలిచిపోవడం సహజమే అయినప్పటికీ రోజుల నూజివీడ్డు మాత్రం రోజుల తరబడి నీటిలో నానాల్సిందే. నీరు ఇంకిపోతే కానీ రోడ్డు కనిపించని పరిస్థితి నెలకొన్న తీరుతో రోజుల తరబడి వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల రెండు రోజుల క్రితం విఎంసి కమిషనర్ జె నివాస్ నూజివీడు రోడ్డును సందర్శించిన సమయంలో ఆ నీటిని విద్యుత్ మోటార్లతో తోడించడంతోపాటు శాశ్వత పరిష్కారం కింద ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగువన పెట్రోల్ బంక్ వద్ద ఇంకుడు గుంత తవ్వి నీటిని తరలించాలని సూచించారు. కానీ ఆ దిశగా అధికారులు తీసుకొన్న చర్యలేవీ కనిపించడం లేదు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి నూజివీడు రోడ్డుకు వర్షం నీటి ముంపు నుంచి విముక్తి కలిగించాలని స్థానికులు కోరుతున్నారు.