గుంటూరు

ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 20: పట్టణంలోని 18వ వార్డు హుస్సేన్ కట్ట వద్ద రెండు మద్యం షాపుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిల పక్షం రాజకీయ పార్టీల ఆధ్వర్యాన గురువారం మహిళలు రిలేదీక్ష ప్రారంభించారు. దీక్షలో వివిధ పార్టీలకు చెందిన మహిళా కౌన్సిలర్లు దామర్ల పద్మజ, పంచుమర్తి భార్గవి, వంగర శకుంతల, సునీత, పలువురు స్థానిక మహిళలు దీక్షలో పాల్గొన్నారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ, పట్టణ టిడిపి అధ్యక్షుడు నందం అబద్దయ్య, వైఎస్‌ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు రామనాధం పూర్ణచంద్రరావు, మున్సిపల్ కౌన్సిలర్ మునగపాటి వెంకటేశ్వరరావు, హాండ్లూమ్‌బోర్డు సభ్యుడు జగ్గారపు శ్రీనివాసరావు, ఎఫ్‌సిఐ సభ్యుడు జె రామ్మోహనరావు, దామర్ల శివవెంకటరాజు తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. హుస్సేన్‌కట్ట ప్రాంతంలో నివాస గృహాల మధ్య మద్యంషాపులు పెట్టనివ్వబోమని నేతలు పేర్కొన్నారు. మద్యంషాపులను వ్యతిరేకిస్తున్న కౌన్సిలర్ దామర్ల పద్మజపై దౌర్జన్యానికి దిగిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం హుస్సేన్‌కట్ట ప్రాంతంలో మద్యం షాపులను అనుమతి ఇవ్వబోమని రాష్ట్ర ఎక్సైజ్‌మంత్రి జవహర్ నుంచి హామీ లభించడంతో మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి దీక్షా శిబిరానికి వచ్చి దీక్షలో ఉన్న మహిళలకు నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు.