మహబూబ్‌నగర్

జూరాల ఆయకట్టు సాగునీటి విడుదలపై... అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 20: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రైతులు ఇటివల సాగునీరు విడుదల చేయాలని ధర్నాకు దిగడంతో పాటు అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చి ముందుండి ఆందోళన చేపట్టారు. దాంతో జూరాల ఆయకట్టుకు సాగునీటి విడుదలపై గత రెండుమూడు రోజులుగా తర్జనభర్జన జరుగుతుంది. అందులో భాగంగా గురువారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాజెక్టు అధికారులతో సమీక్షించారు. ఇఎన్‌సి మురళీధర్‌రావుతో పాటు ప్రాజెక్టు ఎస్‌ఇ రఘునాథ్‌రావులతో సమీక్షించిన మంత్రి జూరాల ఆయకట్టుకు సాగునీటి విడుదల సాధ్యా ఆసాధ్యలపై చర్చించారు. ఈ సమీక్షకు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిసామర్ధ్యాన్ని బట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎగువ ప్రాంతం నుండి ఎన్ని వేల క్యూసెక్కుల వరద వస్తోందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలకు వస్తున్న వరదపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలకు వరదను బట్టి జూరాల ద్వారా నీటిని విడుదల చేయాలన్నారు. కోయిల్‌సాగర్‌కు ఎత్తిపోతలకు కూడా ఇప్పటికే మోటార్లు ఆన్ అయ్యాయని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా కూడా ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని సూచించారు. రైతులు ఆందోళన బాట పట్టకుండా ఎప్పటికప్పుడు నీటి విడుదలపై అప్రమత్తంగా ఉంటూ త్వరలోనే నీటిని విడుదల చేయాలని సూచించారు. వనపర్తి, గద్వాల జిల్లాల కలెక్టర్లను కూడా మంత్రి ఆదేశిస్తూ జూరాల ఆయకట్టు రైతులకు సాగునీటి విడుదలపై దృష్టి పెట్టాలని ఎగువ ప్రాంతంలో వస్తున్న వరదను ఎప్పటికప్పుడు గమనించాలని మంత్రి తెలిపారు. జూరాల ఎడమ, కుడికాలువ చివరి ఆయకట్టు రైతులకు సైతం సాగునీటిని అందిస్తామని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా వారి మాటలు జిల్లా రైతాంగం నమ్మవద్దని మంత్రి కోరారు. అయితే జూరాల ఆయకట్టు రైతులకు మాత్రం సాగునీరు విడుదల చేసే అంశాన్ని సంబందిత అధికారులు పరిశీలించాలని మంత్రి సూచించారు.