ప్రకాశం

పోలీసుల మోహరింపు మధ్య దళితుల భూముల్లో చెరువు తవ్వకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్చూరు, జూలై 20: భారీ పోలీసుల మోహరింపు మధ్య దేవరపల్లిలో దళిత రైతులు సాగుచేసుకుంటున్న భూములలో బలవంతంగా కుంటలు తవ్విన సంఘటన గురువారం వేకువజాము నుంచి కొనసాగింది. దాదాపు 300మందికి పైగా గ్రామంలో పోలీసులను మోహరించి, 12 ప్రొక్లెయిన్‌లతో కుంటలు తవ్వటం మొదలు పెట్టారు. మీడియా ప్రతినిధులను కూడా గ్రామంలోకి వెళ్లకుండా ఉదయం దేవరపల్లి చప్టా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో ఏం జరుగుతుందో అన్న విషయం కూడా బయటకు రానివ్వకుండా తవ్వకాలు సాగించారు. దేవరపల్లి గ్రామంలో చెప్పకుండానే పోలీసులు కర్ఫ్యూ వాతావరణం సృష్టించారు. ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా కుంటలు తవ్వటం ప్రారంభించారు. గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేశారు. బయట వ్యక్తులు గ్రామంలోని వెళ్లకుండా పోలీసులు సోదా చేశారు. ఈ గ్రామంలోని దళితుల రైతులను, వైకాపా నాయకులను వేకువజామునే పోలీసులు అదుపులోకి తీసుకుని, స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం తరువాత గ్రామంలోకి పోనివ్వటంతో సిపిఎం నాయకులు, దళిత సంఘాల నాయకులు దళిత రైతులను పరామర్శించటానికి వెళ్లారు. వీరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు హనుమంతురావు మాట్లాడుతూ నీరు-చెట్టు పేరుతో పేద, దళిత రైతులు ఎన్నో సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న భూములను కుంటలుగా తవ్వటం అన్యామని అన్నారు. వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని వైకాపా నియోజకవర్గ సమన్వయ కర్త గొట్టిపాటి భరత్ విమర్శించారు. దేవరపల్లి లోని దళిత రైతుల భూములను నీరు-చెట్టు పేరుతో అక్రమంగా తవ్వటాన్ని తీవ్రంగా ఖండిం చారు. గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ దళితులపై దమన కాండ సాగిస్తున్న ప్రభుత్వానికి చమరగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. దళిత భూములను తవ్వద్దు అని అడ్డుకున్న రైతులను పోలీసులు ఈడ్చుకువెళ్లి నిర్భంధించటం హేయమైన చర్య అన్నారు. దళితుల భూములలో కుంటలు తవ్వి వారి పొట్టలు కొట్టవద్దన్నారు. గతంలోనే ఆర్డీవో గ్రామంలో ఉన్న ప్రస్తుత చెరువులు నీటి అవసరాలకు సరిపోతాయని చెప్పినా... ప్రస్తుత ప్రభుత్వం బలవంతంగా దళితులపై కక్షకట్టి వారి భూములను లాక్కొని కుంటలుతవ్వటాన్ని తీవ్రంగా ఖడిస్తున్నట్లు తెలిపారు.
నేడు చలో దేవరపల్లి
దళితులు సాగుచేసుకుంటున్న భూములను నీరు-చెట్టు పేరుతో కుంటలు గా తవ్వటాన్ని నిరసిస్తూ.... శుక్రవారం చలో దేవరపల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సిపిఎం కార్యదర్శి పి మధు వెల్లడించారు. గురువారం సిపిఎం నాయకులు, మధు, వైవి వెంకటేశ్వరావు, వైకాపా బాపట్ల పార్లమెంట్ బాధ్యుడు అమృతపాణి తదితరులను దేవరపల్లి వెళ్లకుండా పర్చూరు బొమ్మల సెంటర్‌లోనే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మొత్తం 39మందిని స్టేషన్‌లో నిర్భందిం చారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ నియోజకవర్గంలో టిడిపి ప్రభుత్వం అక్రమంగా 285 కుంటలు తవ్వి మట్టిని అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతితో ఒక ఎకరంలో 2మీటర్లు లోతున మట్టిని అమ్మితే 5లక్షలు ఆదాయం వస్తుందని, 22 ఎకరాలలో ఈ మట్టి ని అమ్మితే ఎంత వస్తుందోఅని ఆలోచించాలని చెప్పారు. ఒక రైతు వద్ద గ్రామంలో వాగు పోరంబోకు భూములు అన్యాక్రాంతమై ఉన్నాయని వాటిని వెలికితీసి, కుంటలు తవ్వాలని చెప్పారు. ఎమ్మెల్యే నిరంకుశత్వానికి దళిత రైతులు బలైవుతున్నట్లు చెప్పారు. దళితుల మీద టిడిపి ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని, దీనిని సవాళ్లుగా స్వీకరిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎదిరిస్తున్నామని.. వారి ఆటలు సాగనివ్వమని చెప్పారు. బాధిత దళిత రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.