ప్రకాశం

జిల్లాలో కరవును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి : కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 20 : జిల్లాలో కరవును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ వి వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో వ్యవసాయశాఖ, దాని అనుబంధ శాఖల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు కురుస్తున్నా ఆశాజనకంగా లేవన్నారు. దీంతో ఈ ఏడాది కూడా కరవు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఖరీఫ్ పంటల కాలంలో సాధారణంగా 2.45 లక్షల హెక్టార్లల్లో పంటల సాగు విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 21వేల హెక్టార్లల్లో మాత్రమే నాట్లు వేశారన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు కురిస్తే పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. అందులో ఈ-క్రాప్ బుకింగ్ 19,647 హెక్టార్లు పూర్తయిందన్నారు. జిల్లాలో 47,688 నమూనాలను సేకరించి 2,20,738 భూసార ఆరోగ్యకార్డులకుగాను నూటికి నూరుశాతం లక్ష్యాన్ని సాధించి పంపిణీ చేశామన్నారు. జిల్లాలోని 405మంది ఎంపిఇవోలు గ్రామాల్లో విస్తత్రంగా తిరిగి రైతులకు భూసారానికి తగ్గట్లుగా పంటలు వేయాలని, దాతు లోపాలను సవరించుకునేలా చైతన్యపరచాలని కోరారు. జిల్లాకు మంజూరైన 6,473 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఎక్కడా డీలర్లు నకలీ విత్తనాలు విక్రయించకుండా దాడులు విస్త్రృతంగా కొనసాగించాలన్నారు. జిల్లాలో ఎరువులు కావాల్సిన దానికన్నా ఎక్కువగానే నిల్వలు ఉన్నాయన్నారు. కరవును ఎదుర్కొని మంచి దిగుబడులు సాధించే పంట సాగు పద్ధతులను అనే్వషించి రైతులకు వివరించాలన్నారు. సాధారణ పంటలు కాకుండా కరవును తట్టుకునే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించేలా కృషి చేయాలన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఎంతగానో ఉపయోగకరమని, ఈ నెలాఖరు వరకు ప్రీమియం చెల్లింపునకు గడువు ఉందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా మండల స్థాయిలో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రైతులు సూక్ష్మసేద్యం వైపు దృష్టి సారించేలా అధికారులు తీవ్రంగా కృషి చేయాలన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 22వేల హెక్టార్లలో సూక్ష్మసేద్యం చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు 6400 హెక్టార్లకు రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. ఈ నెలాఖరుకు పదివేలు, వచ్చే ఆగస్టు నెలాఖరుకు 22వేల హెక్టార్ల లక్ష్యాన్ని తప్పనిసరిగా చేరుకోవాలన్నారు. ఇందుకోసం అధికారులు, సిబ్బంది విస్తత్రంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేసి రైతులను చైతన్యపర్చాలన్నారు. జిల్లాలో 26వేల మెట్రిక్ టన్నుల ఆక్వా కల్చర్ సాధించే దిశగా ప్రణాళికలు పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ సంవత్సరం 400 హెక్టార్లలో సూక్ష్మసేద్యం ద్వారా మల్బరీసాగుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక, మత్స్యశాఖ జెడిలు మురళీకృష్ణ, బలరాం, ఎపిఎంఐపి పిడి రవీంద్రబాబు, సిపివో కెటి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.