సబ్ ఫీచర్

అతి ఏదైనా అనర్థమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య చాలామంది చెప్పే మాట డైటింగ్. తమ రూపంలో ఏదో లోపం ఉందనీ, ఎక్కువగా తినేస్తున్నామనే భావన చాలామందిలో ఉంది. శరీరాకృతిని నాజూగ్గా ఉంచుకోవాలనే తపనతో తిండి తగ్గించేసుకుంటూ లేపోని జబ్బుల్ని తెచ్చుకుంటూ డబ్బు నష్టపోతున్నారు. నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయినా బక్క ప్రాణులుగా మారిపోతున్నా ‘బాడీ డిస్మారిక్ డిజార్డ్’ (బిడిడి)తో బాధపడేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇలాంటివారిని చూచిన ఓ గ్రాఫిక్ డిజినర్ ప్రముఖ వ్యక్తులు జీరో సైజ్‌కి చేరుకుంటే ఎలా ఉంటారో అని ‘కనువిప్పు’ కలిగేలా కళ్ళకు కట్టినట్లు తన డిజైన్స్ చూపించాడు.
అందంకోసం తాపత్రయం తప్పుకాదు. కానీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి కదా. ‘అతిగా అందంకోసం ఆరాటపడేవారూ, అతిగా డైటింగ్ చేసేవాళ్ళూ ఎక్కడా బాగుపడ్డట్టు చరిత్రలో లేరు’ అని గ్రాఫిక్స్‌తో మేజిక్ చేసి చూపించాడు. తన క్రియేటివిటీతో ఆరోగ్యమే మహాభాగ్యం అనుకునేలా చేస్తున్నాడు. అతను అందించిన బొమ్మలు చూస్తే జీరో సైజు భామలు సెలబ్రిటీలైనా మనం చూడలేం. నిజం ఎప్పుడూ నిష్ఠూరమే కదా!

-తరిగొప్పుల మూర్తి