గుంటూరు

కార్పొరేట్‌కు ధీటుగా గురుకుల పాఠశాలల నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జూలై 21: కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా రాష్ట్రంలో సాంఘిక, గిరిజన సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖామంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న హాస్టల్స్ తనిఖీలలో భాగంగా శుక్రవారం ఆయన తెనాలి కొత్తపేటలోని ఎస్సీ, ఎస్టీ బాలుర, చంద్రబాబునాయుడు కాలనీలోని ఎస్సీ బాలికల హాస్టల్స్‌ను ఆయన తనిఖీ చేశారు. వసతి గృహాల్లో అందిస్తున్న సౌకార్యాలు, వసతులు, విద్య, బోధన, పుస్తకాల పంపిణీ, భోజనం తదితర అంశాలపై విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సంబంధించిన పాఠ్యాంశాలకు చెందిన నోట్ పుస్తకాలను పరిశీలించి ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో అందిస్తున్న మెనూ వివరాలు, విద్యార్థులు, ఉద్యోగుల హాజరు పట్టీలను పరిశీలించి రిజిస్టర్‌లో సంతకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు ఖర్చుచేసి సాంఘిక, గిరిజన సంక్షేమ హాస్టల్స్‌తోపాటుగా గురుకులాలను ఉన్నత విద్యాసంస్థలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పేద విద్యార్థులు ప్రభుత్వ గురుకులాల ద్వారా ఉత్తమ విద్యార్థులుగా, ఉన్నతమైన స్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అనేక సౌకార్యలు, వసతులు మెరుగుపరిచామని తెలిపారు. ఎస్టీ హాస్టల్ వార్డెన్ కోటేశ్వరరావు విధులకు హాజరుకాకపోవడాన్ని గమనించి ఆయనకు మెమో ఇవ్వాలని ఎపిడబ్ల్యూఏను ఆదేశించారు. విషయం తెలుసుకున్న వార్డెన్ హుటాహుటిన మంత్రి ముందు హాజరై తాను గ్రూపు పరీక్షలకు హాజరౌతున్నట్లు విన్నవించటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి చేతకాకుంటే విధులకు సెలవు పెట్టుకోవాలని, పిల్లల విషయం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వెంటనే గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌తో ఫోనుద్వారా మాట్లాడుతూ గిరిజన సంక్షేమ హాస్టల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సంక్రమంగా పనిచేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికైనా అధికారులు పనితీరు మెరుగు పరుచుకోవాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల గిరిజన సంక్షేమ హాస్టల్స్‌కు చెందిన ఐదుగురు పిల్లలు పర్యతారోహణకు ఎంపికైన విషయాన్ని ఆయన ఈసందర్భంగా గుర్తుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ గురుకులాలు, హాస్టల్స్‌లో చదువుకునే పిల్లలకు తమ ప్రతిభను కనబరుస్తూ ఉన్నత స్థితికి చేరాలని విద్యార్ధినీ, విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పెండేల వెంకట్రావు, వార్డు కౌన్సిలర్, జిల్లా, డివిజన్ సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖాధికారులు, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.