కరీంనగర్

ప్రత్యేక ఉద్యమంలో టిఎన్‌జిఓల పాత్ర ఎనలేనిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూలై 21: మలిదశ తెలంగాణ ఉద్యమంలో టిఎన్‌జిఓల పాత్ర ఎనలేనిదని, ఉద్యమ ఆరంభం నుంచి రాష్ట్ర విభజన వరకు ఉద్యమ నేత కెసిఆర్ వెన్నంటి ఉండి ముందుకు నడిపించిన ఘనత వారిదేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కొనియాడారు. తెలంగాణ బ్రువరేజెస్ కార్పోరేషన్ చైర్మన్‌గా ఎన్నికైన ఆ సంఘం గౌరవ అధ్యక్షులు కె.దేవీప్రసాద్‌ను శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి ఆది నుంచి టిఎన్‌జిఓలు వెనె్నముకగా నిలుస్తూ సకలజనుల సమ్మెతో దేశాన్ని తెలంగాణ వైపు తిప్పారని, సాగరహారం, ఛలో అసెంబ్లీ లాంటి ఆందోళనలతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాన్ని గడ గడలాడించారని అన్నారు. వీరి పోరాట స్పూర్తితోనే యావత్ తెలంగాణ ప్రజానీకం ఏకతాటిపైకి వచ్చి అప్పటి ప్రభుత్వాలను కండ్లు తెరిపించాయని, ప్రపంచ దేశాల్లో సైతం తెలంగాణ ఉద్యమంపై చర్చ కొనసాగేలా ఉద్యమాన్ని ఉవ్వెత్తున పైకి లేపారని అన్నారు. సకల జనులను ఏకం చేయటంలో సఫలీకృతం కావటంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాదించుకున్నామని గుర్తు చేశారు. కొత్త రాష్ట్రంలో సైతం పాలనాపరంగా అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న సందర్భంలో అదనపు పని గంటలు తమ సేవలు అందించి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములమవుతామని నిరూపించారని అన్నారు. బ్రూవరేజెస్ కార్పోరేషన్ చైర్మన్‌గా ఎన్నికైన దేవీప్రసాద్ ఉద్యోగులను ఏకం చేస్తూ ఉద్యమానికి ఊతమిచ్చాడని, దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయనకు రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ పదవి ఇచ్చి సముచిత ప్రాధాన్యతను కల్పించారని అన్నారు. అనంతరం దేవీప్రసాద్‌ను టిఎన్‌జిఓల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, మేయర్ రవీందర్ సింఘ్, టిఎన్‌జిఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.హమీద్, జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, కాళీచరణ్, నర్సింహాస్వామి, సుద్దాల రాజయ్య, ఏరువ లలితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మానకొండూర్, జూలై 21: రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. శుక్రవారం మానకొండూర్ తహశీల్దార్ కార్యాలయంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలను నాటారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన అదనపు భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలను పెంచి ఆకుపచ్చ తెలంగాణ కోసం కృషి చేయాలన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 750 కోట్ల రూపాయలతో నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లా కల్టెకర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, బిసి వసతిగృహం, బాలురు పాఠశాలలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ రాజాగౌడ్, జివి రామక్రిష్ణరావు, ఎంపిపి లింగయ్య, ఎఎంసీ చైర్మన్ మల్లగల్ల నగేష్, వైస్‌ఎంపిపి దేవ సతీష్ రెడ్డి, తహశీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎంపిడిఓ వెంకట్రాం రెడ్డి, ఎంఈఓ మదుసూదన్‌చారి, అటవీశాఖ అధికారులు కనకయ్య, నాయబ్ తహశీల్దార్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
తిమ్మాపూర్, జూలై 21: ప్రభుత్వ పథకాలను అన్నివర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని మనె్నంపల్లి గ్రామంలో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. అనంతరం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో హరిత హారం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో ఎంపికైన 18 మంది లబ్దిదారులకు 8యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి కాబట్టి పశువుల మేతకు పోషణకు ఎటువంటి చింతలేదన్నారు. హరితహారంలోప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. అనంతరం గొర్రెలకు నట్టల నివారణకు మందులను కలెక్టర్ వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ప్రేమలత, సర్పంచ్ గడ్డం సుగుణ, డి.విక్రమ్, ఆర్‌డిఓ రాజాగౌడ్, ఎంపిడిఓ పవన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ తహశీల్దార్‌తో మేం వేగలేం..!
* మూకుమ్మడిగా కలెక్టరేట్‌కు తరలివెళ్లిన రెవెన్యూ సిబ్బంది
కాల్వశ్రీరాంపూర్, జూలై 21: ఈ తహశీల్దార్‌తో మేము వేగలేక పని చేయలేక పోతున్నామని రెవెన్యూ సిబ్బంది మూకుమ్మడిగా పెద్దపల్లి కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. కాల్వశ్రీరాంపూర్ తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఆర్‌ఐ, ఏడుగురు కార్యదర్శులతో పాటు కార్యాలయ సిబ్బంది శుక్రవారం విధులు ముగించుకొని తహశీల్దార్ ప్రసాద్ సిబ్బందిపై చేస్తున్న ఒత్తిడిపై కలిసికట్టుగా కలెక్టర్ కార్యాలయంకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆర్‌ఐతో పాటు విఆర్‌ఓలు మాట్లాడుతూ తాము విధులు సరిగా నిర్వహిస్తున్నా అసభ్యకర పదజాలంతో తహశీల్దార్ దూషిస్తున్నాడని, తహశీల్దార్ కార్యాలయంలో పని చేయడం మావల్ల కాదని ఆరోపిస్తూ కలెక్టరేట్ కార్యాలయంకు తరలివెళ్లారు. ఈ విషయంపై తహశీల్దార్ ప్రసాద్‌ను వివరణ కోరగా సక్రమంగా విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినందువల్లే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

ప్రభుత్వ భూమిలో అక్రమ సాగు
కాల్వశ్రీరాంపూర్, జూలై 21: మండలంలోని జంగారం గ్రామ శివారులో గల ప్రభుత్వ భూమిని కొందరు రైతులు సాగు చేస్తుండగా రెవెన్యూ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. సర్వే నంబర్ 580, 581, 582, 583 లలో సుమారు 18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కాగా ఇటీవల ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి గ్రామ శివారులోని ఉస్సేన్‌మియా వాగు వద్ద ఉన్న చెక్ డ్యాంను పరిశీలనకు వచ్చి ప్రభుత్వ భూమిని గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్పందించిన అధికారులు ప్రభుత్వ భూమి సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు. అప్పటికే భూమి సాగు చేసుకుంటున్న రైతులు సర్వే చేసి హద్దులు నిర్ణయించిన అనంతరం మళ్లీ సాగు చేస్తుండగా శుక్రవారం రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. చేసేదేమీ లేక తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి అధికారులతో మొరపెట్టుకున్నట్లు సమాచారం. కాగా, ఈ ప్రభుత్వ భూమిలో కొందరు రెవెన్యూ అధికారులు బేరసారాలు చేస్తున్నట్లు సమాచారం.

జగిత్యాల సిడాట్ టెలిఫోన్ ఎక్ఛేంజ్‌లో భారీ ప్రమాదం
జగిత్యాల, జూలై 21: జగిత్యాల బిఎస్‌ఎన్‌ఎల్ సిడాట్ టెలిఫోన్ ఎక్ఛేంజ్‌లో శుక్రవారం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఉపగ్రహం ద్వారా వచ్చే సమాచార వ్యవస్థను అనుసంధానం చేసే పరికరాలు మంటల్లో ఆహుతి అయ్యాయి. సిడాట్ సాంకేతిక పరికరాలు వేడెక్కకుండా ఎసి ప్లాంట్లలో ఎర్పడిన సాంకేతిక లోపంతో అల్యూమినీయం సిలిండర్‌లు పేలడంతో సిడాట్ ఎక్ఛేంజ్ యంత్రాలు మంటల్లో బూడిద అయ్యాయి. అయితే సిడాట్ టెలిఫోన్ ఎక్ఛేంజ్‌లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో జగిత్యాల టెలిఫోన్ ఎక్ఛేంజ్ పరిధిలోని పలు ఎక్ఛేంజ్‌లకు సంబంధాలు కుప్పకూలాయి. అంతేకాకుండా జీవనోపాధి కోసం వేలాది సంఖ్యలో అరబ్బు దేశాలతో యూరఫ్ దేశాల్లో నివాసం ఉంటున్న జిల్లాకు చెందిన కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్లు తెగిపోయాయి. ముఖ్యంగా జగిత్యాల బిఎస్‌ఎన్‌ఎల్ సిడాట్ ఎక్ఛేంజ్ పరిధిలోకి పని చేస్తున్న 2జి, 3జి,4జి, బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్లు కూడా పని చేయక సంబంధాలు నిలచిపోయాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న బిఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది జగిత్యాల ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అల్యూమినీయం సిలిండర్‌లు పేలడంతో వ్యాపించే పొగ ప్రమాదకరమైంది కావడంతో లోనికి ఎవరిని అనుమతించడం లేదు. ఈ విషయంపై సంబంధింత అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఎవరు ముందుకు రాలేదు. ప్రమాదానికి గల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రాజారంలో క్షుద్రపూజలు..హత్యలు
ధర్మపురి, జూలై 21: ధర్మపురి మండలం రాజారం గ్రామంలో ఎదులాపురం సత్తయ్య అనే వ్యక్తిని గత మే 10న హత్య గావించారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణ రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జెఎవి ప్రసాద్, కోశాధికారి చుక్క గంగారెడ్డి, కుంభాజి రవి ప్రసాద్, సిరికొండ అశోక్ చారి తదిరులు రాజారం సందర్శించి, నిందితునిగా భావిస్తున్న తోడేటి వెంకటరాజం ఇంటిని, క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న స్థలాన్ని, పరిశీలించారు. అనంతరం ధర్మపురిలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, మృతుడు సత్తయ్య కొంతకాలంగా భార్యతో కాక, విడిగా ఉంటున్నాడని, రాజారంకు చెందిన నిందితుడు గుడిని ఏర్పాటు చేసి, రాత్రిపూట క్షుద్రపూజలు చేయడం జరుగుతున్నదని, తద్వారా అమాయకులను మోసం చేస్తూ, డబ్బులు సంపాదిస్తున్నాడని ఆరోపించారు. దీనిలో భాగంగానే సత్తయ్యను 15రాత్రులు గుడి వద్దే పడుకోవాలని ఒత్తిడి చేశాడని, ఈ క్రమంలో మృతుని వద్ద గల 1,28,000 దోచి, హత్య చేసి, గుడి దగ్గర చంపి, రోడు అవతలి బావి వద్దకు చొక్కాను కుడి కాలికి కట్టి లాక్కెళ్లడం జరిగినట్లు తెలుస్తున్నదని పేర్కొన్నారు. ఈ సంఘటనలో రెండు మాసాలు దాటినా ఎలాంటి స్పంద లేదని, ఇది అప్రజాస్వామికమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో క్షుద్రపూజలు జరగుకుండా కలెక్టర్, ఎస్పీ ప్రభుత్వ యంత్రాంగం చట్టపనమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితునిపై 302కేసు నమోదు చేయాలని, క్షుద్ర పూజల స్థలాన్ని తొలగించాలని, మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా 10లక్షలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కొత్త రాష్టప్రతిని కలిసిన కెప్టెన్
హుజూరాబాద్, జూలై 21: భారత నూతన రాష్టప్రతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్‌ను శుక్రవారం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంతరావు ఢిల్లీలో కలిశారు. కొత్త రాష్టప్రతి రామ్‌నాథ్‌కు కెప్టెన్ అభినందనలు తెలిపారు. కెప్టెన్ మాట్లాడుతూ రాష్టప్రతి ఎన్నికల్లో టిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు రామ్‌నాథ్‌కు మద్దతు ఇచ్చామన్నారు. ఆయన భారీ మెజారిటీతో గెలవడం హర్షనీయమన్నారు.

ఉద్యమ స్ఫూర్తితో హరితహారం
తిమ్మాపూర్, జూలై 21: ప్రత్యేక తెలంగాణను సాధించుకోవడం కోసం ఏ విధంగా అయితే ఉద్యమించామో అదే ఉద్యమ స్ఫూర్తితో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి బంగారు తెలంగాణ కోసం మేము సైతం ముందున్నామని తెలంగాణ గ్రావరేజ్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద రావు అన్నారు. తెలంగాణ గ్రావరేజ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమింపబడిన తరువాత మొట్టమొదటి సారిగా కరీంనగర్ జిల్లాకు వస్తున్న సందర్భంగా టిఎన్‌జిఓ నాయకులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. ముందుగా ఎల్‌ఎండి కాలనీలోని అమరవీరుల స్థూపం వద్ద, అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్ (ఎస్సారెస్పీ) కార్యాలయంలో మొక్కలను నాటారు. అనంతరం ఎస్సారెస్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్పూర్తితో ఎల్‌ఎండిలో అమరవీరుల స్థూపాన్ని నిర్మించిన స్థలం నుండే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం, హరితహారం, బంగారు తెలంగాణ లాంటి అనేక కార్యక్రమాలను ఈ స్థూపం వేదికగా మారిందన్నారు. హరితహారం కూడా తెలంగాణలో ఒక ఉద్యమంగా సాధించాలనే కెసిఆర్ నిర్ణయమన్నారు. నిరంతర విద్యుత్, రైతులకు ఎకరాకు ఎనిమిది వేలు, ఉద్యోగులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కాలుష్య సమతుల్యానికి తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల జనాభాకు రెండు లక్షల 40 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో ముందుకువెళ్లడం కెసిఆర్ ఆకాంక్షగా పేర్కొన్నారు. మూడవ విడతగా 40 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో అధికారులు, అనధికారులు కలిసికట్టుగా మొక్కలు నాటాలన్నారు. ప్రతీ ఉద్యోగి తమ కుటుంబంలో ఉన్న వారి అందరితో మొక్కలను నాటించాలని సూచించారు. దేశంలోగల 29 రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్ధికి ధీటుగా తెలంగాణ అభివృద్ధి ముందుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌జిఓ స్టేట్ ప్రెసిడెంట్ కారం రవీందర్ రెడ్డి, స్టేట్ సెక్రెటరీ మామిండ్ల రవీందర్, జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, మామిడి రమేష్‌లతో పాటు ఎస్సారెస్పీలో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొన్నారు.

నేర రహిత నవ సమాజ నిర్మాణానికై కృషి చేయాలి
చిగురుమామిడి, జూలై 21: నేర రహిత నవ సమాజ నిర్మాణానికై ప్రతి పౌరుడు కృషి చేయాలని హుస్నాబాద్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ జస్టిస్ వెంకట మాలిక్ సుబ్రమణ్య శర్మ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని సిఎం దత్తత గ్రామమైన చిన ముల్కనూర్ మోడల్ స్కూల్‌లో చిగురుమామిడి రక్షక భటాధికారి తనుగుల సత్యనారాయణ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈసదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన జడ్జి జస్టిస్ శర్మ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే నేర పవృత్తికి, చెడు అలవాట్లకు దూరంగా ఉన్నప్పుడే జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహిచడం సాధ్యతరమవుతుందన్నారు. తల్లిదండ్రుల కళలను సాకారం చేసే దిశగా అడుగులు వేసినవారవుతారన్నారు. సమ, సమాజ నిర్మాణానికి, దేశ అభివృద్ధికి తోడ్పాటునందిచే గొప్ప వ్యక్తులుగా రాణిస్తారని చెప్పారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి, ఉన్నతమైన లక్ష్యాలను అధిగమించాలని కోరారు. ఈసదస్సులో సర్పంచ్ మకుటం రాజయ్య, ఎంపిటిసి ముప్పిడి సంగీత-దేవేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ సాంబారి బాబు, ప్రిన్సిపాల్ కొడిమ్యాల శ్రీనివాస్, ఎఎస్‌ఐ సత్తు వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.