కృష్ణ

పాలనలో ప్రజలను మరింత మెప్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 23: ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వార్డుల పర్యటనలో భాగంగా ఆదివారం స్థానిక 41వ వార్డు ఈడేపల్లిలో మంత్రి రవీంద్ర పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవటంతో పాటు ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూడేళ్ల పాలనలో ప్రజలకు అవసరమైన అన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ వచ్చామన్నారు. రానున్న రెండేళ్లల్లో కూడా ప్రజలు మరింత మెచ్చే విధంగా పని చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున పెన్షన్‌లు అందించిన ఘనత ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. చంద్రన్న బాట కింద అంతర్గత రహదార్లన్నింటినీ సిసి రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే పొగ రహిత నియోజకవర్గంగా మార్చేందుకు పెద్ద ఎత్తున గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. రేషన్ దుకాణాల ద్వారా కిరోసిన్, పంచదార పంపిణీని కూడా త్వరలోనే పునరుద్ధరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కౌన్సిలర్లు నారగాని ఆంజనేయ ప్రసాద్, బత్తిన దాస్, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, టిడిపి నాయకులు పామర్తి నరేష్, కాసాని భాగ్యారావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.