కృష్ణ

వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, జూలై 23: తిరుమల తిరుపతి దేవస్థానంల వారు స్థానిక జెడ్పీ హైస్కూల్ ఆవరణలో ఆదివారం రాత్రి శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తుల గోవిందనామ స్మరణతో ప్రాంగణం మార్మోగిపోయింది. టిటిడి శ్రీనివాస కళ్యాణ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ప్రభాకరరావు పర్యవేక్షణలో ప్రధానార్చకులు పరాంకుస కృష్ణశాయి ఆధ్వర్యాన రుత్వికులు కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీరాం రంగనాథ్ వ్యాఖ్యానం నడుమ అన్నమయ్య బృందం వారు గీతాలాపన చేయగా కళ్యాణం శోభాయమానంగా జరిగింది. యూత్ కోఆర్డినేటర్ నాగలింగం శివాజీ, సమతా పౌండేషన్ ప్రతినిధులు నేతల సతీష్, గుర్రాల లక్ష్మీలతోపాటు ఆరవింద స్కూల్ సిబ్బంది భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రసాద వితరణ గావించారు.