తెలంగాణ

ఆర్టీసీని ప్రైవేటీకరించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూలై 23: తెలంగాణ ప్రజానీకానికి ప్రయాణబంధువైన రాష్ట్ర రోడ్డురవాణాసంస్థను ప్రైవేటీకరించే ప్రసక్తేలేదని, వదంతులు నమ్మాల్సిన పనిలేదని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి స్పష్టం చేశా రు. ప్రయాణీకుల రవాణాకు ఆయువుపట్టైన బస్టాండ్ల ఆధునీకరణలో భాగంగా ఆదివారం నగరంలోని ప్రధాన బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో రోడ్డు సౌకర్యమున్న ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సును నడిపేందుకు సరికొత్త ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. రాష్టవ్య్రాప్తంగా 95బస్‌డిపోలు ఆధునీకరించనున్నట్లు, ఇందుకోసం రూ.40కోట్ల ఖర్చు అంచనా వేసినట్లుపేర్కొన్నారు. ఆధునీకరణలో భాగంగా మొదటి విడతగా రూ.14కోట్లు విడుదల చేయగా, ఇందులో రూ.10కోట్లు రాష్ట్ర ఆర్దికమంత్రి ఈటెల రాజేందర్ తన కోటానుంచి మంజూరీ చేశాడని, మిగతా రూ.4కోట్లు ఆర్టీసీ విడుదల చేసినట్లు తెలిపారు. నష్టాల బారిన నడుస్తున్న ఆర్టీసీ కార్మికులను పట్టించుకోవటంలేదనే అపోహను వీడాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందన్నారు. ప్రైవేట్ వాహనాల మూలంగా ఆర్టీసీకి తీవ్ర నష్టా లు వస్తున్నాయని, అక్రమంగా తిరుగుతున్న ప్రైవేట్ వాహనాలపై కొరఢా ఝులిపించేందుకు రవాణాశాఖాధికారులు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, విద్య, వైద్యం, రవాణా రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు వెచ్చిస్తోందన్నారు. ఇందులో భాగంగానే రూ.60కోట్లతో ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని, రూ.38కోట్లతో ఇళ్ళపై ఉన్న విద్యుత్ వైర్లను తొలగించే పనులు చేపట్టినట్లు, వైద్యరంగంలో ఆస్పత్రి భవనాల మరమ్మత్తులకు, వౌళిక వసతుల కల్పనకోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈసందర్భంగా బస్టాండ్ ఆవరణలో మంత్రులిద్దరు మొక్కలు నాటారు. అనంతరం ఆర్టీసీ వర్క్‌షాప్‌ను సందర్శించారు. పలు విభాగాలు తిరిగి వాటి పనితీరును అడిగి తెల్సుకున్నారు. మొక్కలు నాటారు. వాటి సంరక్షణపై అధికారులకు మార్గదర్శనం చేశారు. ఈసందర్భంగా వీరి వెంట జడ్పీ చైర్‌పర్సన్ ఉమ, ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ,ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్, ఐడిసి చైర్మన్ శంకర్‌రెడ్డి, మేయర్ రవీందర్‌సింగ్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మహేందర్‌రెడ్డి