తెలంగాణ

ఒక్క సమస్యనూ పరిష్కరించని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: తెలంగాణ ప్రభుత్వం ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని , ముఖ్యమంత్రి మాటలతో గడిపేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అస్తవ్యస్థపాలన కొనసాగుతోందని, ముఖ్యమంత్రి హామీల గురించి రాస్తే రామాయణం, చెబితే భారతం అవుతుందని అన్నారు. ఎన్నికల ముందు లెక్కలేనన్ని హామీలు ఇచ్చారని కాని ఒక్కటీ అమలు కాలేదని అన్నారు. రాష్ట్ర మంత్రులపై ఆరోపణలు వస్తున్నాయని, భూ కుంభకోణం, రవాణా శాఖ కుంభకోణాలు, వాణిజ్య శాఖలో కుంభకోణాలతో అవినీతి రక్కసి విచ్చలవిడిగా విజృంభిస్తున్నా ముఖ్యమంత్రి వౌనంగా ఉంటున్నారని, ఈ అవినీతి, అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి బాధ్యులకు శిక్ష పడేలా చూడాలని అన్నారు. మరో పక్క హైదరాబాద్ డ్రగ్ మాఫియాకు కేంద్రంగా మారిందని, మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో హరితహారం ఫోటోలకే పరిమితం అయిందని, రైతలు దుర్బర స్థితిలో ఉన్నారని, కేంద్ర పథకాలు అమలులో ఘోరంగా విఫలమైందని చెప్పారు. రాష్ట్రంలో దళితులపై దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని, మహిళా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కాకతీయుల చరిత్రకు స్థానం లేకుండా చేసిందని , తెలంగాణ ఏర్పడిన తర్వాత అయినా కాకతీయుల గొప్పదనాన్ని చాటుతారనుకుంటే ప్రపంచంలోనే గొప్ప చక్రవర్తి నిజాం ప్రభువు అని కీర్తిస్తున్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.
బిజెపి విస్తారక్ యోజనలో భాగంగా 6వేల మంది కార్యకర్తలు 15 రోజుల పాటు 20వేల పోలింగ్ బూత్‌లలో పర్యటించి, కమిటీలు వేసి పార్టీలో నూతన శక్తిని నింపారని , కోటి కరపత్రాలను పంచారని, పార్టీని పటిష్టం చేయడానికి అసెంబ్లీకి ఒకరు చొప్పున పూర్తి సమయ కార్యకర్తల నియామకం పూర్తయిందని తెలిపారు. పార్టీ నేతలు అంతా రానున్న ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు.
డ్రగ్ డెన్‌గా మారింది: కృష్ణ సాగరరావు
టిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ డెన్‌గా మారిపోయిందని బిజెపి అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు పేర్కొన్నారు. సంప్రదాయం కాని రాక్, పబ్ కల్చర్ హైదరాబాద్‌లో హెచ్చుమీరిందని ఆయన పేర్కొన్నారు. విదేశీ సంస్థలు, కంపెనీలు కలిసి నగరంలో ఏడాదంతా పార్టీలు ఏర్పాటు చేస్తున్నాయని, వీటివల్లనే మద్యం, డ్రగ్స్ వాడకం పెరిగిందని పేర్కొన్నారు. హ్యాపినింగ్ హైదరాబాద్ పేరుతో ప్రభుత్వం పదే పదే చెప్పడంతో డ్రగ్స్ విక్రేతలకు కల్పతరువుగా మారిందని అన్నారు.