ఆంధ్రప్రదేశ్‌

ప్రీ స్కూళ్లుగా అంగన్‌వాడీ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 26: రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లుగా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇది తమ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమని ఆయన చెప్పారు. తెలుగు భాషకు ప్రాధాన్యం తగ్గించుకుండానే ఆంగ్లంలో బోధిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. నేడు ఆంధ్రప్రదేశ్ ఏ విధానం అనుసరిస్తే భవిష్యత్‌లో దేశం అదే అనుసరిస్తుందని తాము చెబుతున్న మాటలు నూరుపాళ్ళూ వాస్తవమని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్ళుగా తీర్చిదిద్దుతున్న తమ ప్రభుత్వ విధానం దేశానికే ఆదర్శమని చంద్రబాబు అన్నారు. బుధవారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ‘అంగన్ వాడీ కేంద్రాలు - ప్రీ ప్రైమరీ స్కూళ్లు’ అంశంపై, తల్లిదండ్రులు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రాంతాలలోని 3,128 అంగన్ వాడీ కేంద్రాలను ఏకీకృతం చేసి 1,026 ప్రీ స్కూల్ సెంటర్లుగా మార్పు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ 1,026 సెంటర్లలో 90వేల మంది విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది ఇక్కడ చేరిన బాలలను సొంత పిల్లల కన్నా మిన్నగా చూసుకుంటూ మాతృమూర్తులను మరిపిస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. తరగతి గదిలో గోడల మీద అందమైన తైలవర్ణ చిత్రాలు, ఆకర్షించే అట వస్తువులు, కుర్చీలు, బల్లలు, ఆహ్లాద వాతావరణం ఉండాలని, ఇందు కోసం ఒక్కో ప్రీ స్కూలు సెంటర్‌కు ప్రభుత్వం రూ. 2.40 లక్షలు వ్యయం చేస్తున్నదన్నారు. ప్రీ స్కూలు సెంటర్లు భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి పునాది అవుతాయన్నారు. అంగన్ వాడీ పేరు త్వరలో మారుస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రీ స్కూళ్ల నిర్వహణ బాధ్యతను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, స్ర్తి, శిశు సంక్షేమ శాఖలు స్వీకరించాయని, మూడేళ్ల వయసున్న చిన్నారులు నర్సరీ, 4 ఏళ్ల వయస్సువారు ఎల్‌కెజి, 4 నుండి 5 ఏళ్ల వయస్సు వుంటే యుకెజి చదివేందుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి వివరించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నియమించే సలహాదారులతో అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విద్యార్థులకు రైమ్స్ నేర్పడంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఉంటుందని వివరించారు. పాఠ్య పుస్తకాలు, కార్యాచరణ పుస్తకాలను పురపాలక శాఖ పంపిణీ చేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. 1,026 ప్రీ స్కూళ్లకుగాను 803 కేంద్రాలకు భవన సదుపాయం ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. విద్యార్థులకు విద్య మీద ఆసక్తి కలిగే విధంగా తరగతి గదులను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తరగతి గదుల్లో గోడలపై వర్ణచిత్రాలు, ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేస్తారని, కుర్చీలు, బల్లలు బాలలకు సదుపాయంగా ఉంటాయన్నారు. విద్యా కేంద్రాల్లో చిన్నారులకు ఏకరూప దుస్తుల పంపిణీ జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆట వస్తువులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కొత్త పాఠశాలలను ఫైబర్ గ్రిడ్‌తో అనుసంధానించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా ఇన్నాళ్లు, ఇనే్నళ్ళుగా తమకు అంగన్‌వాడీ వర్కర్లుగానే గుర్తింపు ఉందని, అటువంటి తమని ఉపాధ్యాయులుగా గుర్తించినందుకు ముఖ్యమంత్రికి అంగన్ వాడీ ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి నారాయణ పాల్గొన్నారు.