విజయనగరం

మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యతఇస్తున్నారని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారు. గురువారం కంటోనె్మంట్ మున్సిపల్ పార్కులో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ రుణాలు, దుల్హాన్ పథకం, ఉపకార వేతనాలు, శిక్షణ, విదేశీ విద్య, షాదీఖానాల నిర్మాణం, చర్చిల నిర్మాణం, శ్మశాన వాటికలు, జెరూసలేం యాత్ర వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మైనార్టీ వర్గానికి చెందిన బాలికల వివాహ నిమిత్తం దుల్హన్ పథకం కింద రూ.50 వేలు వివాహ ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. అర్హులైన వారు ఆన్‌లైన్‌లో రుణాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా జెసి నాగేశ్వరరావు మాట్లాడుతూ లబ్ధిదారులు తప్పనిసరిగా రుణాలను తీసుకున్న తరువాత యూనిట్లను నెలకొల్పి బ్యాంకులకు సకాలంలో బకాయిలను చెల్లించాలన్నారు. మైనారిటీ కార్పొరేషన్ ఇడి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ నిరుద్యోగ మైనార్టీ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ వాటిలో ఉచిత శిక్షణ అందజేస్తున్నామన్నారు. అలాగే విదేశీ విద్య పథకం కింద 11 దేశాల్లో చదువుకోవడానికి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎల్‌డిఎం టి.గురవరయ్య, క్రైస్తవ మైనారిటీ నాయకులు ఆర్‌ఎస్‌జాన్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు షేక్ సబూర్, నిషా బేగం, టిడిపి నేతలు బాషా పాల్గొన్నారు.