గుంటూరు

పన్ను మదింపు ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: నిర్ణీత సమయం పూరె్తైనప్పటికీ స్పెషల్ డ్రైవ్ కింద చేపట్టిన పన్ను మదింపు ప్రక్రియ పూర్తికాకపోవడంపై రెవెన్యూ అధికారులను నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ నిలదీశారు. నెలాఖరులోగా పూర్తికావాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం తన ఛాంబర్‌లో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లతో ఆస్తి పెంపుదల, పౌరసేవా కేంద్ర అర్జీల సత్వర పరిష్కారం ఆక్రమిత పన్ను మదింపు, షాపుల బకాయిల వసూళ్లు, పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారం తదితర అంశాలపై అధికారులతో కమిషనర్ అనూరాధ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అండర్ అసెస్‌మెంట్ అన్ అసిస్మెంట్ వివరాలపై డిప్యూటీ కమిషనర్‌లు, అదనపు కమిషనర్‌లు ప్రతిరోజు సమీక్షించాలని ఆదేశించారు. పౌరసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుని గడువుదాటిన అర్జీలను సమీక్షించిన కమిషనర్ అధిక సంఖ్యలో పెండింగ్‌లో ఉండటాన్ని గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సంబంధిత గుమస్తాలు, ఆర్‌ఐలు శనివారంలోగా గడువుదాటిన అర్జీలను పరిష్కరించాలని స్పష్టంచేశారు. ఆగస్టు 1 నుంచి పౌరసేవా కేంద్రాల్లో గడువుదాటిన అర్జీలకు బాధ్యులైన వారికి అపరాధ రుసుం విధించేలా ఉత్తర్వులు జారీచేయాలని అదనపు కమిషనర్‌ను ఆదేశించారు. నగరపాలక సంస్థకు సంబంధించిన షాపు పన్ను వసూళ్లపై అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. 1వ తేదీ నుండి బకాయిల వసూళ్లపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ కె రామచంద్రారెడ్డి, డిప్యూటీ కమిషనర్‌లు ఎం ఏసుదాసు, డి శ్రీనివాసరావు, ఆర్‌ఒలు ఎస్‌ఎస్ ప్రసాద్, వి వెంకట్రామయ్య, వేణుబాబు తదితరులు పాల్గొన్నారు.