మహబూబ్‌నగర్

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల: సమస్త జీవ కోటి మనుగడకు మూలాధారమైన చెట్లను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి భాధ్యత అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జడ్చర్ల మండలంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా జడ్చర్ల పట్టణంలోని న్యూ బస్టాండ్ సమీపంలో, మండల పరిధిలోని అల్వాన్ పల్లి గ్రామంలో నిర్వహించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాలల్లో ముఖ్యమంత్రి పేషీ, హరితహారం ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ తదితరులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా చంద్రా గార్డెన్స్‌లో టిఆర్‌ఎస్‌వి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ యావత్తు తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణ రాష్ట్రంగా మార్చేందుకే తెలంగాణ ప్రభుత్వం గత మూడు విడతలుగా విజయవంతంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. అందరి సమిష్టి కృషితోనే కార్యక్రమం విజయవంతం అవుతుందని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించనప్పుడే కార్యక్రమ నిర్వహణకు సార్థకత నెలకొంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి విశేషంగా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. అన్ని వర్గాల విద్యార్థిని,విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉధ్దేశ్యంతో ఎస్సి.ఎస్టి,బిసి,మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు,కళశాలలు విరివిగా ఎర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. అనంతరం మంత్రి సమక్షంలో మండల పరిధిలోని ఉదండాపూర్ గ్రామానికి చెందిన పలువురు వార్డుమెంబర్లు మంత్రి సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.కార్యక్రమాలల్లో ఎంపిపి లక్ష్మి,జడ్పిటిసి జయప్రద,మండల పార్టీ అధ్యక్షుడు యాదయ్య, నాయకులు గోవర్థన్ రెడ్డి,పిట్టల మురళీ,శ్రీకాంత్,రాములు తదితరులు పాల్గొన్నారు.