కృష్ణ

అబ్దుల్ కలాంకు ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: దివంగత రాష్టప్రతి అబ్దుల్ కాలం ద్వితీయ వర్ధంతి స్థానిక ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ కార్యాలయంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలి రాజా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించగా తెలుగుదేశం నేతలు జెడ్పీటిసి వెంకటేశ్వరరావు, జాసం చిట్టిబాబు, జాగులం మురళీకృష్ణ, మండలి వెంకట రామమోహనరావు తదితరులు నివాళులర్పించారు.

పట్టుదలతో పని చేసే వారికి పదోన్నతులు తథ్యం
మచిలీపట్నం (కోనేరుసెంటర్): క్రమశిక్షణ, పట్టుదలతో పని చేసే వారికి వాటంతట అవే పదోన్నతులు వస్తాయని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో వైర్‌లెస్ కమ్యూనికేషన్ విభాగంలో ఎస్‌ఐగా పని చేస్తూ సిఐగా పదోన్నతి పొందిన కెవి హరిబాబును గురువారం ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ పట్టుదలతో పని చేసి పదోన్నతులు పొందాలన్నారు.

ఒకే రీతిలో వరుస దొంగతనాలు
కూచిపూడి: కూచిపూడి పోలీసు స్టేషన్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో ఒకే రీతిలో మూడు దొంగతనాలు జరగటంతో ప్రజలకు కంటిమీద కునుకు కొరవడింది. పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక డ్యూటీల నిమిత్తం ఇతర ప్రాంతాలకు తరలివెళ్లటంతో రాత్రి వేళ గస్తీలు కొరవడ్డాయి. ఫలితంగా తాళం వేసిన గృహాలకు గజ నాగవాసాలు కోసి జరుగుతున్న దొంగతనాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారుఝామున పెడసనగల్లు గ్రామంలోని సూరపనేని శ్రీరామదాసు గృహంలో జరిగిన దొంగతనంలో సుమారు రూ. 10 వేలు నగదు అపహరణకు గురైనా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రామదాసు కుటుంబం ఈ నెల 19వ తేదీన వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. గురువారం ఉదయం ఆయన బంధువు సూరపనేని బాబూరావు రామదాసు గృహానికి వెళ్లి చూడగా గజ నాగవాసం కోసి ఉండటం గుర్తించారు. లోపలకు వెళ్లి చూడగా ఇల్లంతా చిందరవందరగా ఉంది. కూచిపూడి పోలీసులకు సమాచారం అందించటంతో ఎఎస్‌ఐ బివి సంతోషరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సమాచారం తెలుసుకున్న రామదాసు బంధువు ఇంటికి వచ్చి చూడగా బీరువాలోని దుస్తుల్లో దాచిన రూ. 10వేలు పోయాయని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ తెలిపారు. కాగా ఇదే రీతిలో ఈ నెల 24వ తేదీన చినముత్తేవి గ్రామంలో, 21వ తేదీన కొండవరం గ్రామాల్లో ఇదే విధంగా దొంగతనాలు జరిగాయి. పోలీసు శాఖ దీనిపై పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ప్రత్యేక వైద్య శిబిరంలో 32 మందికి వైద్య పరీక్షలు

తోట్లవల్లూరు: మండలంలోని బొడ్డపాడు పీహెచ్‌సీ సబ్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఉచిత ప్రత్యేక వైద్యశిబిరంలో గురువారం 32మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పమిడిముక్కల మండలం వీరంకిలాకు పీహెచ్‌సీ డాక్టర్ బబిత రోగులకు వైద్య పరీక్షలు చేశారు. గ్రామంలో జ్వరాలు విజృంభిచడంతో ఈ నెల 21 నుంచి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసిన విషయం విదితమే. గురువారం కొత్తగా జ్వరం వచ్చిన ఒక కేసు నమోదయిందని డాక్టర్ బబిత తెలిపారు. జ్వరం బాధలతో నీరసంగా ఉన్న వారికి సెలైన్ ఎక్కించి మందులు అందించారు.

3566 మిర్చి టిక్కీల కొనుగోలు
నందిగామ: స్థానిక మార్కెట్ యార్డ్‌లో గురువారం నిర్వహించిన మిర్చి కొనుగోళ్లలో 56మంది రైతులు 3566 టిక్కీలను విక్రయించుకున్నారు. 12మంది బయ్యర్‌లు కొనుగోళ్లలో పాల్గొనగా అత్యధిక ధర క్వింటాల్‌కు రూ.7400లు, అత్యల్ప ధర రూ.4వేలు లభించింది. కొనుగోళ్లను మండల తెదేపా అధ్యక్షుడు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, యార్డ్ కార్యదర్శి గోవిందులు పర్యవేక్షించారు. వారంలో ఐదు రోజుల పాటు మిర్చి యార్డ్ నిర్వహిస్తుండటంతో నందిగామ పరిసర ప్రాంతాలకు చెందిన మిర్చి రైతులే కాకుండా దూర ప్రాంతాల మండలాలకు చెందిన రైతులు సైతం ఇక్కడకు వచ్చి వారి పంటను విక్రయించుకుంటున్నారు. కోల్డ్ స్టోరేజ్‌ల వద్ద క్రయ విక్రయాలు పూర్తిగా నిరోధించి మార్కెట్ యార్డ్‌లోనే జరిగే విధంగా చర్యలు తీసుకోవడంతో నిత్యం 7నుండి 15మంది బయ్యర్ (టేడర్)లు కొనుగోళ్లకు ఇక్కడకు వస్తున్నారు. నాణ్యత ఆధారంగా ధర లభిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బాపులపాడు మేజర్ కాలువ పనుల పరిశీలన
హనుమాన్‌జంక్షన్: నాగార్జునసాగర్ ఎడవకాలువ పరిధిలో ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో చేపట్టిన పనులను గురువారం అధికారులు పరిశీలించారు. నూజివీడు డివిజన్ క్రింద 3వజోన్ నీటివినియోగదారుల సంఘాల పరిధిలోని మైనర్, సబ్‌మైనర్ కాలువలు పూడికతీత, కట్టలు బలపర్చడం, సిమెంట్ కట్టడాల పునః నిర్మాణ తదితర పనులను 2015లో ప్రారంభించారు. పనులు 95% పూర్తికావడంతో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి పథకం ఇంజనీరింగ్ కన్సల్‌టెంట్ ప్రసాద్, జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ళ వెంకటగోపాలకృష్ణలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. పూర్తయిన పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు మిగిలిన 5% పనులను వెంటనే పూర్తిచేయాలని అదేశించారు. 2018 జూలై నాటికి చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే గోదావరి జలాలు బాపులపాడు మేజర్‌కు వచ్చే అవకాశం వుందని ఆళ్ళ తెలిపారు. ఈ పర్యటనలో నాగార్జునసాగర్ డిప్యూటీ ఎఇ జి.శ్రీనివాసరావు, ఎఇ శ్యామ్‌కుమార్, నీటిసంఘం అధ్యక్షుడు కె.సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.