ప్రకాశం

అందరికీ రుణాలు అందేలా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు : జిల్లాలో ఇప్పటివరకు ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా రుణాలు అందని వారికి విస్తత్రంగా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎస్‌సి కార్పొరేషన్ డైరెక్టర్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న స్వయం ఉపాధి పథకాలు ఇప్పటివరకు చేరని ప్రాంతాలకు పెద్దఎత్తున తీసుకెళ్లేందుకు వీలుగా ఫెసిలిటేటర్స్ (దోహదకారులు)లను ఎంపిక చేసి తీసుకుంటామన్నారు. సమాజంలో సేవ చేయాలన్న దృక్పధం కలిగిన వాలంటీర్‌గా సేవలందించేందుకు ముందుకు వచ్చిన వారిని ఫెసిలిటేటర్స్‌గా తీసుకుని గ్రామాల్లో స్వయం ఉపాధి అవకాశాలపై, పథకాలపై అవగాహన కల్పిస్తూ అర్హులందరికి సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలు పొందేవిధంగా చైతన్యం తీసుకొస్తామన్నారు. ప్రతి మండలం నుంచి పదిమంది ఎస్‌సి యువతను ఫెసిలిటెటర్స్‌గా తీసుకుంటామన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎస్‌సి కార్పొరేషన్‌కు రూ.120 కోట్లను బడ్జెట్‌లో కేటాయించామని, రాష్ట్రం విడిపోయి 13 జిల్లాలుగా ఏర్పడిన తరువాత ప్రస్తుతం కార్పొరేషన్‌కు రెండువేల 713కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఎస్‌సి జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 23 శాతం ఉన్నారని అత్యధిక ఎస్‌సి జనసాంద్రత కలిగిన జిల్లా ప్రకాశం జిల్లా అని తెలిపారు. జిల్లా కుసుమారు రూ.250 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. నిధుల కేటాయింపు సైంటిఫిక్ మ్యానర్‌లో జరిగిందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో దారిద్రరేఖకు దిగువన ఉన్న ఎస్‌సి కుటుంబాలకు ఆర్థిక చేయూతనిచ్చి వివిధ పధకాలను అమలు చేయటం వల్ల దారిద్య్రం నుంచి తొలగించేందుకు ఎస్‌సి కార్పొరేషన్ విశేషంగా కృషి చేస్తుందని చైర్మన్ వెల్లడించారు. ఈ పథకానికి లబ్ధిదారుడు నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. లబ్ధిదారుల ఎంపిక నియమ నిబంధనల మేరకు, పారదర్శకంగా చేపట్డడం జరుగుతుందన్నారు. ఎంపికైన లబ్ధిదారులు తమ యూనిట్లు స్థాపించిన వారికే రాయితీలు అందేలా చూస్తున్నామన్నారు. దళారి వ్యవస్థను అరికడతామన్నారు. జిల్లాకు కేటాయించిన నిధులు ఖచ్చితంగా ఆర్థిక సంవత్సరంలోనే ఖర్చుచేసేలా చూస్తున్నామన్నారు. సుమారు రూ.20 లక్షల విలువైన ఇన్నోవ వాహనాలను అందించామని, ప్రొక్లెయినర్లు, బ్యాటరీతో నడిచే వాహనాలు, జెసిబిలు నిరుద్యోగ ఎస్‌సిలకు త్వరలో అందిస్తామన్నారు. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న దళిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించి సమాజంలో మంచి ఉన్నత స్థానానికి తీసుకొచ్చేందుకు ఎస్‌సి కార్పొరేషన్ అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని తెలిపారు. విలేఖర్ల సమావేశంలో ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఎ జయరాం తదితరులు పాల్గొన్నారు.