శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

హత్యలు, దోపిడీలకు అడ్డాగా గూడూరు సబ్ డివిజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు: ప్రజల మాన, ప్రాణ, ఆస్తుల రక్షణే ధ్యేయంగా పనిచేయాల్సిన పోలీసులు గూడూరు సబ్ డివిజన్‌లో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల రెండు నెలల కాలాన్ని పరిశీలిస్తే సైదాపురం మండలంలో ఓ వ్యక్తి మైకా గుంతలో పడి మృతి చెందితే రెండురోజుల తరువాత సైదాపురం పోలీసులు అతని మృతదేహాన్ని తాము బంధువులమంటూ వచ్చిన వారికి అప్పగించి చేతులు దులుపుకున్నారు. కాగా, అతనికి అన్ని కర్మకాండలు జరిపించిన అనంతరం అసలు కుటుంబ సభ్యుడు ఇంటికి చేరుకున్నాడు. అయితే మృతిచెందిన వ్యక్తి ఎవరన్నదని ఇంతవరకు పోలీసులు ఆచూకీ కనిపెట్టలేదు. మరి నెల రోజుల క్రితం గూడూరు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో రావి చెరువులో ఓ వ్యక్తిని అతని ప్రత్యర్థులు అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చారు. అయితే ఈ కేసు విషయంలో నాలుగురోజుల్లోనే పోలీసులు అసలు నిందితులను పట్టుకొని పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగిందని చెప్పి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన విషయం విదితమే. అదే క్రమంలో చిల్లకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి పట్రగుంట వద్ద ఓ మహిళను అతి కిరాతకంగా ఎవరో హత్యచేసి ఆనవాళ్లు లేకుండా పడేసి వెళ్తే ఇంతకీ ఆ మహిళ ఎవరు, హత్యకు పాల్పడిన వారు ఎవరన్నది ఇంత వరకు పోలీసు దర్యాప్తు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో సైదాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రోజున శిద్దలకోన అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెంది ఉండగా అతని వద్ద లభించిన ఆధారాల ప్రకారం అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఒక్కరోజే చిల్లకూరు, వాకాడు ప్రాంతాల్లో రెండు హత్యలు చోటుచేసుకున్నాయి. ఒకటి చిల్లకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఎవరో హత్య చేసి పారిపోవడంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాకాడు మండలంలో ఆదివారం కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త భార్యను నరకడంతో ఆమె గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇలా చెప్పుకొంటూ పోతే గూడూరు సబ్ డివిజన్‌లో నేరాల సంఖ్య కొండవీటి చాంతాడంత అవుతుంది. ఇక గూడూరు పట్టణంలో రెండు పోలీస్‌స్టేషన్‌లకు ఒక సిఐ, రెండు స్టేషన్‌లకు ముగ్గురు ఎస్సైలు ఉన్నా వారి కళ్లు గప్పి దోపిడీ దొంగలు దొరికిన కాడకి దోచుకొని వెళ్తున్నారు. వారం రోజుల వ్యవధిలో గూడూరు 1వ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో కోనేటిమిట్ట, బొగ్గులదిబ్బ ప్రాంతాల్లో దొంగలు చొరీలకు పాల్పడ్డారు. పెద్దఎత్తున సొమ్ములు పోకున్నా పోలీసుల పనితీరుకు ఈ దోపిడీ దొంగలు సవాల్ విసిరారని చెప్పవచ్చు. అలాగే నేరంతో సంబంధం లేని ఓ గిరిజనుడిని రూరల్ పోలీసులు చిత్ర హింసలకు గురిచేసి ఎమ్మెల్యే జోక్యంతో విడిచిపెట్టిన సంఘటన తెలిసిందే. నేరాల నియంత్రణ కన్నా ఇక్కడి పోలీసులు జిల్లాకు కొత్తబాస్ రాక ముందు పోస్టింగ్‌ల కోసం మంచి కలక్షన్ స్టేషన్‌ల కోసం పైరవీలు చేయించుకొని పోస్టింగులు వేయించుకునేవారు. జిల్లాకు కొత్త బాస్ వచ్చిన తరువాత ఎవరైతే పోస్టింగుల కోసం పైరవీలు చేయించుకున్నారో వారే ఇప్పుడు విఆర్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. విధుల పట్ల సమర్ధవంతంగా పనిచేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారన్న విమర్శలను మూటకట్టుకున్నారు. నిన్న మొన్నటి వరకు సబ్ డివిజన్‌లో దోపిడీ పర్వం యథేచ్ఛగా సాగినా కొత్త ఎస్పీ వారిపై కనే్నసి ఉంచి వారి గత చరిత్ర ఆధారంగా పలువురు సిఐలకు మెమోలు ఇచ్చినట్లు సమాచారం. డివిజన్‌లో ఇక ఇసుక, ఎర్రచందనం, రేషన్ బియ్యం, మద్యం బెల్టుదుకాణాల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న అపవాదును మూటకట్టుకున్న సబ్ డివిజన్ పోలీసులు ఈ వ్యవస్థను జిల్లాకు కొత్తగా వచ్చిన పోలీస్ బాస్ గాడి పెట్టాలని డివిజన్ ప్రజానీకం కోరుకుంటోంది. అలాగే పోలీసులపై నమ్మకం కలిగే విధంగా వ్యవస్థను పటిష్టం చేసి ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను తీసుకొని రావాలని ప్రజలు కోరుతున్నారు.