తెలంగాణ

రైతు సమగ్ర సర్వేను ఆగస్టు 17కి కంప్యూటరీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: రాష్ట్రంలో చేపట్టిన రైతు సమగ్ర సర్వే సమాచారాన్ని వచ్చే నెల 17 నాటికి కంప్యూటరీకరణ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ పార్థసారథి జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడిక్కడ వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో కమిషనర్ పార్థసారథి, డైరక్టర్ డా.ఎం.జగన్మోహన్ సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారుల వద్ద ఉన్న పంటల సంబంధిత వివరాలు, ఉద్యాన అధికారుల వద్ద ఉన్న తోటలు, బిందు సేద్య వివరాలలను పరస్పరం క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు.
ఏ విధమైన లోపాలకు తావివ్వకుండా రైతుల సమగ్ర వివరాలను రైతు సమగ్ర సర్వే జాబితాలో పొందుపర్చి కంప్యూటీకరణ చేయాలని స్పష్టం చేశారు. వర్షాల వల్ల పంటల సాగు పుంజుకుంటున్న నేపధ్యంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని మార్క్‌ఫెడ్ అధికారులకు, ఎరువుల రేక్‌ల పరిస్థితి గురించి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. జిఎస్‌టి తర్వాత ఎరువుల ధరలు పెరిగాయన్న అపోహను దూరం చేసే బాధ్యత వ్యవసాయ శాఖపై ఉందని అన్నారు.
నకిలీ విత్తనాల నిరోధానికి నిరంతర నిఘా ఉండాలని అన్నారు. ఇందుకు టాస్క్ఫోర్స్ సమాయత్తం కావాలని, ఇప్పటి వరకు దొరికిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు విశ్రమించకూడదని ఆదేశించారు.