తెలంగాణ

భారీగా డ్రగ్స్ పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: ఎక్సైజ్ సిట్ అధ్వర్యంలో డ్రగ్స్ మాఫియా మూలాలపై దర్యాప్తు కొనసాగుతుండగానే, కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ శుక్రవారం ఓ భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించింది. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) హైదరాబాద్ విభాగం అధికారులు, మెదక్, నల్గొండ జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. భారీ ఎత్తున మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 5 కోట్లు విలువ చేసే 600 కేజీల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ వీటి విలువ మార్కెట్లో రూ. 12.5 కోట్లు ఉంటుందని డిఆర్‌ఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వ్యవహారంలో సంబంధమున్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ప్రయోగశాలల్లో డ్రగ్స్ తయారీ
మెదక్, నల్గొండ జిల్లాల్లో డిఆర్‌ఐ అధికారులు జరిపిన సోదాల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. ఏకంగా భారీ ప్రయోగశాలల్లో మత్తుపదార్థాలను తయారు చేస్తున్నట్టు డిఆర్‌ఐ గుర్తించింది. దీంతో ఆయా ల్యాబ్‌లను సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ల్యాబ్‌లు ఏవైనా సంస్థలకు చెందినవా? లేక డ్రగ్స్ ముఠా స్వయంగా నిర్వహిస్తుందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
డ్రగ్స్ రవాణా చేస్తోన్న పలు ముఠాలను తెలంగాణ డిఆర్‌ఐ అధికారులు అరెస్టు చేసిన దరిమిలా, కేంద్ర సంస్థలు సైతం దూకుడు పెంచారు. ఇదిలావుండగా ఈ డ్రగ్స్‌లో ఎక్కువగా అఫ్రజోలం ఉన్నట్టు మత్తుపదార్థమే ఉందని డిఆర్‌ఐ అధికారులు పేర్కొన్నారు.