తెలంగాణ

సమగ్ర డేటా పొందుపరచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టం (సిసిడిఎన్‌ఎస్) కమిటీ చైర్మన్ రాష్ట్ర డిజిపి అనురాగ్‌శర్మ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. సిసిటిఎన్‌ఎస్ అభివృద్ధిపై చర్చించారు. కంప్యూటర్లలో సమగ్ర డేటా పొందుపరచాలని, ఎప్పటికప్పుడు డేటా వివరాలను జిల్లా అధికారులు సమీక్షించాలని డిజిపి అనురాగ్ శర్మ అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లోవున్న డేటా అప్‌లోడింగ్ పూర్తి చేయాలని ఆయన సూచించారు.
జిల్లా కేంద్రాల్లోని సిబ్బందికి డేటా ఎంట్రీపై శిక్షణ ఇచ్చామని, సిస్టం అడ్మినిస్ట్రేషన్‌లో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు త్వరలోనే అడ్వాన్స్డ్ శిక్షణ, అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నట్టు డిజిపి తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డిజిపిలు అంజనీకుమార్, గోవింద్ సింగ్, రవిగుప్తా తదితరులు పాల్గొన్నారు. ఐఆర్‌ఎస్ కమిషనర్ టి వెంకటరమణ రావు, ఎన్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్, ఎన్‌సిఆర్‌బి ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం.. శుక్రవారం హైదరాబాద్‌లో పోలీస్ అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న డిజపి అనురాగ్ శర్మ