తెలంగాణ

నాణ్యతలో రాజీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి నాణ్యత విషయంలో రాజీ లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నాణ్యత తనిఖీలు ఇక మీదట పకడ్బందీగా ఉండాలని, ఎటువంటి లోపాలను ఉపేక్షించ వద్దని ఆదేశించారు. ప్రామాణికతకు, నాణ్యతకు మారుపేరుగా ఆర్‌అండ్‌బి నిర్మాణాలు ఉండాలని ఆదేశించారు. శుక్రవారం నాడిక్కడ ఆర్‌అండ్‌బి ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో మంత్రి శాఖ పనితీరును సమీక్షించారు. సమీక్షలో నేషనల్ అకాడమి ఆఫ్ కనస్ట్రక్షన్ (నాక్) వార్షిక బడ్జెట్‌కు, ఇతర ప్రతిపాదనలకు అనుమతులు మంజూరు చేశారు. న్యాక్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇస్తున్న ట్రైనింగ్, తర్ఫీదు పొందిన వారికి ఇచ్చే కనీస వేతనాలు తదితర అంశాలను మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. లోపభూయిష్ట నిర్మాణాలు ఉంటే వెంటనే గుర్తించి సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలోనే ఖాళీల భర్తీ, అర్హులకు పదోన్నతులు, సరైన పనికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఆర్‌అండ్‌బి శాఖ వద్ద అనేక ప్రాజెక్టులు ఉండడంతో త్వరలోనే శాఖలోని ఖాళీలు కూడా భర్తీ చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఇప్పటికే 106 ఎ.ఈ పోస్టులను భర్తీ చేయడానికి సిఎం కెసిఆర్ ఆమోదం తెలిపారని అన్నారు. ఖాళీల భర్తీతో పాటు అర్హులైన వారికి పదోన్నతులు కూడా కల్పిస్తామని చెప్పారు.
అదే సమయంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది, అధికారులపై చర్యలు ఉంటాయని తెలిపారు. సిఎం కెసిఆర్ తమ శాఖపై నమ్మకం ఉంచి అప్పగించిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. ఈ సమీక్షలో శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, న్యాక్ డైరక్టర్ జనరల్ భిక్షపతి, ఇంజినీర్ ఇన్ చీఫ్ రవీందర్‌రావు, మహేందర్, చీఫ్ ఇంజినీర్లు ఆశారాణి తదితరులు పాల్గొన్నారు.