తెలంగాణ

‘హాకా’ ద్వారా కందిపప్పు సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడి కేంద్రాలకు ‘హాకా’ ద్వారా కందిపప్పు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా పిలిచిన టెండర్లతో కిలో కందిపప్పు ధరను 57.15 రూపాయలుగా నిర్ణయించారు. హాకాకు కమిషన్ ఇచ్చే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌తో చర్చించిన తర్వాత నిర్ణయిస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ శనివారం ఇక్క డ తెలిపారు. గతంలో జిల్లాల వారీ గా కందిపప్పు కొనుగోలు చేయగా కిలో 64.90 రూపాయలు మొదలు కుని 107 రూపాయల వరకు ధర చెల్లించా రు. మార్కెట్‌లో కందిపప్పు దిగుబడి ఎక్కువగా ఉండటంతో, రాష్టవ్య్రాప్తంగా ఒకే ధర నిర్ణయించేందుకు ఆనంద్ చైర్మన్‌గా ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం 2017 ఏప్రిల్ 7న నియమించింది. ఈ కమిటీ ఏప్రిల్ 22న దాల్‌మిల్లర్లతో చర్చలు జరపగా కిలో72 రూపాయలకు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ ధర ఎక్కువగా ఉందన్న అనుమానంతో జూన్ 12 న కమిటీ మరోసారి సమావేశమై టెండర్లు పిలవాలని నిర్ణయించింది.
ఈ నెల 28 ఆన్‌లైన్ టెండర్లు పిలవగా ముగ్గురు దాల్‌మిల్లర్లు పాల్గొన్నారు. వీరిలో విజయవాడకు చెందిన వాసుదేవ దాల్ ప్రొ డక్ట్స్ కిలోకు 57.15 రూపాయలు కోట్ చేయగా, ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీల క్ష్మీ దాల్ మిల్ కిలోకి 59.22 రూపాయ లు కోట్ చేసింది. మరొక సంస్థ టెక్నిక ల్ బిడ్ లో అర్హత సాధించలేదు. తక్కు వ కోట్ చేసిన విజయవాడకు చెం దిన వాసుదేవ దాల్ ప్రొడక్ట్స్ సంస్థకు కందిపప్పు సరఫరా చేసేందుకు అవకాశం ఇచ్చా రు. హాకాద్వారా ఈ కందిపప్పు తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తారు. హాకా నోడల్ ఏజన్సీగా వ్యవహరిస్తుండటం తో జిఎస్‌టితో కలిపి కిలోకి కమిషన్ ఎంత ఇవ్వాలో నిర్ణయిస్తామన్నారు.

చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్